- Telugu News Photo Gallery Cinema photos Samantha celebrates her 36th birthday with Citadel cast, Photos goes viral
Samantha: బర్త్ డే వేడుకల్లో సమంత.. స్టైలిష్ డ్రెస్‌లో కనువిందు చేసిన అందాల తార
హీరో వరుణ్ ధావన్, సిటాడెల్ సృష్టికర్తలు రాజ్, డీకేలతో పాటు చిత్రబృందమంతా ఈ వేడుకల్లో సందడి చేసింది. తాజాగా ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Updated on: May 06, 2023 | 4:42 PM

స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల తన పుట్టినరోజును జరుపుకొంది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపారు.

కాగా తన బర్త్‌డే రోజున ఎలాంటి పార్టీలు, ఈవెంట్లలో కనిపించలేదు సామ్. అయితే తన లేటెస్ట్ వెబ్ సిరీస్ సిటాడెల్ సెట్‌లో ఆమె పుట్టిన రోజు సెలబ్రేషన్స్ గ్రాండ్‌గా జరిగాయి.

హీరో వరుణ్ ధావన్, సిటాడెల్ సృష్టికర్తలు రాజ్, డీకేలతో పాటు చిత్రబృందమంతా ఈ వేడుకల్లో సందడి చేసింది. తాజాగా ఈ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది సామ్. ప్రస్తుతం ఇవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా నైట్ డ్రెస్సులో సామ్ కేక్ కట్ చేస్తోన్న ఫొటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. సమంత కీలక పాత్రలో వచ్చిన శాకుంతలం ఇటీవలే రిలీజైన సంగతి తెలిసిందే.

గుణశేఖర్ దర్శకత్వంలో తెరెక్కిన ఈ సినిమా ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆమె ఆశలన్నీ సిటాడెల్ సిరీస్‌తో పాటు విజయ్ దేవరకొండ ఖుషి సినిమాపైనే ఉన్నాయి.





























