Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs MI: హిట్‌మ్యాన్ పేరిట ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డులు.. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అగ్రస్థానంలోకి..

IPL 2023: ఐపీఎల్ క్రికెట్‌లో ‘ఎల్ క్లాసికో’గా పరిగణించే ‘చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్’ మ్యాచ్‌ ఈ రోజు అంటే శనివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తరఫున ఆ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ(0) తన ఖాతా..

CSK vs MI: హిట్‌మ్యాన్ పేరిట ఐపీఎల్ చరిత్రలోనే చెత్త రికార్డులు.. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా అగ్రస్థానంలోకి..
Rohit Sharma
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 06, 2023 | 5:52 PM

ఐపీఎల్ క్రికెట్‌లో ‘ఎల్ క్లాసికో’గా పరిగణించే ‘చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్’ మ్యాచ్‌ ఈ రోజు అంటే శనివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తరఫున ఆ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ(0) తన ఖాతా తెరవలేకపోయాడు. మూడు బంతులు ఎదుర్కొని కూడా డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్‌ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ చెత్త రికార్డు సృష్టించాడు.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మతో పాటు సునీల్ నరైన్(కోల్‌కతానైట్ రైడర్స్), మన్‌దీప్ సింగ్(కోల్‌కతానైట్ రైడర్స్), దినేష్ కార్తీక్‌(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) కూడా 15 డకౌట్‌లతో ఉన్నారు. కానీ ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ వేసిన బంతికి రోహిత్ ఖాతా తెరవకుండానే క్యాచ్ ఔట్ అవడం ద్వారా 16వ సారి డకౌట్ అయ్యాడు. ఇలా ఐపీఎల్ చరిత్రలో 16 సార్లు డకౌట్ అయిన రోహిత్ అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా అవతరించాడు.

ఇవి కూడా చదవండి

గౌతమ్ గంభీర్‌ రికార్డ్ బ్రేక్

ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా రెండో సారి జరుగుతున్న ‘చెన్నై టీమ్ vs ముంబై టీమ్’ మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ మరో రికార్డును కూడా తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న రికార్డును కూడా రోహిత్ శర్మ తన సొంతం చేసుకున్నాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్ 10 డకౌట్‌లతో అత్యధిక సార్లు డకౌట్ అయిన సారధిగా చెత్త రికార్డును కలిగి ఉన్నాడు. కానీ నేటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా 11వ సారి డకౌట్ అయిన రోహిత్ ఆ రికార్డును తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు.

కాగా, చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ఈ క్రమంలో ముంబై తరఫున నేహల్ వధేరా(64) అర్థశతకంతో రాణించగా, సూర్య కుమార్ యాదవ్(26), ట్రిస్టన్ స్టబ్స్(20) పర్వాలేదనిపించారు. ఇక మిగిలినవారిలో ఏ ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. అలాగే చెన్నై బౌలర్లలో పతిరాణా 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహార్, దేశ్‌పాండే చెరో 2, జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
వీడు బ్రాండెడ్ దొంగ.. వీడి బ్రాండ్ ఏమిటంటే? వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
అల్లుడితో వెళ్లిపోయిన అత్త.. తిరిగి వచ్చింది కానీ వీడియో
కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో
కారుల్లో వస్తారు.. రెక్కీ నిర్వహిస్తారు ఆ తర్వాత వీడియో
మన డబ్బులు భద్రమేనా.. మే1నుంచి కనిపించని బ్యాంకులు!
మన డబ్బులు భద్రమేనా.. మే1నుంచి కనిపించని బ్యాంకులు!