Sachin Tendulkar: పొగ గొట్టం ఊదుతూ కట్టెల పొయ్యి మీద వంట చేసిన సచిన్.. క్రికెట్ గాడ్ సింప్లిసిటీకి ఫ్యాన్స్ ఫిదా
సాధారణంగా సెలబ్రిటీలు తమ బర్త్ డే వేడుకలను ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనే లేదా ఏ లగ్జరీ రిసార్ట్స్‌లో చేసుకుంటారు. అయితే గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పేరున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం సింపుల్‌గా ఓ కుగ్రామంలో తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాడు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇటీవలే 50వ వసంతంలోకి అడుగుపెట్టాడు. తన పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు తమ బర్త్ డే వేడుకలను ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనే లేదా ఏ లగ్జరీ రిసార్ట్స్‌లో చేసుకుంటారు. అయితే గాడ్ ఆఫ్ క్రికెట్‌గా పేరున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మాత్రం సింపుల్‌గా ఓ కుగ్రామంలో తన బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ విషయాన్ని అతనే సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. సచిన్‌తో పాటు అతని సతీమణి అంజలి, కుమార్తె సారా టెండూల్కర్ ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సచిన్ తన సతీమణి, కూతురితో కలిసి కట్టెల పొయ్యి మీద వంట చేశారు. ఈ సందర్భంగా షేర్ చేసిన ఫొటోల్లో సచిన్ పొగ గొట్టం ఊదుతూ కనిపించడం గమనార్హం. అతని పక్కనే అంజలి, సారా కూర్చొని ఉండడం మనం గమనించవచ్చు.
ఈ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేసిన సచిన్.. ‘మనం ప్రతిరోజూ హాఫ్ సెంచరీ కొట్టలేం. అయితే అర్ధసెంచరీ కొట్టిన సందర్భాన్ని మాత్రం మన ప్రియమైన వారితో సెలబ్రేట్ చేసుకోవాలి. నా 50వ పుట్టిన రోజును నా ఫ్యామిలీతో కలిసి ఓ కుగ్రామంలో జరుపుకున్నాను. ఐపీఎల్‌లో బిజీగా ఉండడం వల్ల నా కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఈ ట్రిప్ మిస్ అయ్యాడు’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చాడు సచిన్. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సచిన్ టెండూల్కర్ సింప్లిసిటీని చూసి అభిమానులు, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సచిన్ కుమారుడు అర్జున్ ప్రస్తుతం ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
It’s not every day that you hit a half-century, but when you do, it’s worth celebrating with the ones who matter the most. Recently celebrated a special 50 in a quiet serene village with my team – my family! ❤️
PS: Missed Arjun a lot as he is busy with the IPL. pic.twitter.com/KjIrRvciOu
— Sachin Tendulkar (@sachin_rt) May 5, 2023
.@sachin_rt’s father was a professor and he shaped the lives of several students.
As a tribute to his parents, #SachinTendulkarFoundation built a school in Sandalpur (MP), that will provide free education to 2300 children over the next decade for a brighter tomorrow.#STF pic.twitter.com/9PHXr0PzxM
— Sachin Tendulkar Foundation (STF) (@STF_India) May 3, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..