AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs LSG: లక్నో టీమ్ ప్రతీకారం తీరేనా..? ఐపీఎల్ వేదికగా తలపడనున్న పాండ్యా బ్రదర్స్.. తుది జట్టు వివరాలివే..

GT vs LSG: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో పాండ్యా బ్రదర్స్ తలపడనున్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్‌ని హార్దిక్ పాండ్యా నడిపిస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా..

GT vs LSG: లక్నో టీమ్ ప్రతీకారం తీరేనా..? ఐపీఎల్ వేదికగా తలపడనున్న పాండ్యా బ్రదర్స్.. తుది జట్టు వివరాలివే..
Gt Vs Lsg
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 07, 2023 | 8:45 AM

Share

GT vs LSG: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఈ రోజు జరగనున్న మ్యాచ్‌లో పాండ్యా బ్రదర్స్ తలపడనున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగే ఈ మ్యాచ్ కోసం గుజరాత్ టైటాన్స్‌ని హార్దిక్ పాండ్యా నడిపిస్తుండగా.. లక్నో సూపర్ జెయింట్స్‌ కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా వ్యవహరించనున్నాడు. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలను అక్రమించిన ఈ జట్లు 16వ సీజన్‌లో రెండో సారి బరిలోకి దిగుతున్నాయి. అంతకముందు ఏప్రిల్ 16న జరిగిన మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో లక్నో టీమ్‌పై గుజరాత్ జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య జరగబోయే పోరులో ఎలా అయినా విజయం సాధించి, గుజరాత్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని లక్నో భావిస్తోంది.

కాగా, లక్నో సూపర్ జెయింట్స్ రెగ్యులర్ కెప్టెన్ గాయం కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగిన కారణంగా టీమ్‌ని కృనాల్ నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక కృనాల్ నాయకత్వంలో లక్నో జట్టు ఆడిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో కృనాల్ సేన 19.2 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 125 చేసింది. మరి నేటి మ్యాచ్‌లో క‌ృనాల్ ఏ విధంగా తన జట్టును నడిపిస్తాడో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

ప్లేయింగ్ ఎలెవన్ వివరాలు(అంచనా)

గుజరాత్ టైటాన్స్ (GT): వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్

లక్నో సూపర్ జెయింట్స్ (LSG):

కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..