Horoscope Today: ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.. రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి సోమవారం (08 మే 2023).. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

Horoscope Today: ఈ రాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి.. రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope Today
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Narender Vaitla

Updated on: May 08, 2023 | 5:00 AM

Horoscope Today: తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోందని ముందే తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది విశ్వసించే విధానం జ్యోతిష్యం. జ్యోతిష్య శాస్త్రం మేరకు 12 రాశుల వారికి సోమవారం (08 మే 2023).. రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వండి. మితిమీరిన ఔదార్యం వల్ల నష్టపోతారు. ఉద్యోగ పరంగా కొద్దిగా కష్టపడాల్సి వస్తుంది. కీలక విషయాల్లో బంధుమిత్రుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఆకస్మిక ధన లాభం ఉంది. శుభవార్త వింటారు. సమయోచిత నిర్ణయాలతో కుటుంబ సమస్యను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం బాగానే సాగిపోతుంది. అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. కొద్దిపాటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆదాయ పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపారాలకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారి తీస్తాయి. ఒక స్నేహితుడిని ఆర్థికంగా ఆదుకుంటారు. ఇతరుల బాధ్యతలను నెత్తిమీద వేసుకుంటారు. పిల్లలు శుభవార్త తీసుకువస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అధికారుల అభిమానం సంపాదిస్తారు. విలాసాల మీద ఖర్చు చేసే అవకాశం ఉంది. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. స్నేహితులు నమ్మించి మోసగించే అవకాశం ఉంది. ఎవరికీ వాగ్దానాలు చేయకండి. హామీలు ఉండకండి. బంధువులలో ఒకరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకోవాల్సింది. అనారోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పిల్లల్లో ఒకరు శుభవార్త చెబుతారు. ఉద్యోగ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపారంలో ఆశించినంతగా లాభాలు రాకపోవచ్చు. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. ఇరుగుపొరుగుతో పేచీలు తలెత్తే అవకాశం ఉంది. స్నేహితుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థికంగా నిలకడగానే ఉంటుంది. అదనపు ఆదాయ మార్గం కోసం ప్రయత్నాలు చేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి విశేష పురోగతి కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉద్యోగ జీవితంలో మాత్రం ఒడిదుడుకులు తప్పవు. పిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. స్నేహితులతో విభేదాలు ఏర్పడవచ్చు. పెళ్లి ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు. ప్రేమ వ్యవహారాలు పరవాలేదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా అంతా బాగానే ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. బంధువులు కొద్దిగా ఒత్తిడి తెస్తారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. విద్యార్థులు సునాయాసంగా ఉత్తీర్ణత సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆదాయంలో కొద్దిపాటి పెరుగుదల ఉంటుంది. విలాసాల మీద ఖర్చు చేయడం తగ్గించండి. కోర్టు కేసు ఒకటి అనుకూలంగా మారుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది. ఆరోగ్యం పర్వాలేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ పరంగా కొద్దిగా ప్రతికూలత కనిపిస్తోంది. అధికారులతో ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి సంబంధం ఒకటి ఇబ్బంది కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ధనుస్సు(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

కుటుంబ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆర్థికంగా కాస్తంత పుంజుకుంటారు. పొదుపు సూత్రాలు పాటిస్తారు. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఆర్థికంగా ఉపయోగకరమైన ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

బంధువుల ద్వారా ఒక మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో మెరుగుపడుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఉద్యోగ వాతావరణం సానుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా అవరోధాలు ఎదురైనప్పటికీ చక్కని అభివృద్ధిని సాధిస్తారు. ఐటీ రంగం వారికి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తుంది. ఐటీ రంగానికి చెందిన ఉద్యోగులు ఉద్యోగం మారటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువర్గంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందుకు సాగిపోతారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగరీత్యా అంతా మంచే జరుగుతుంది. వ్యాపారం అన్ని విధాలా అనుకూలిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పరవాలేదు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. అవసరమైన పనులు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. విద్యార్థులకు బాగానే ఉంటుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య కథనాల కోసం క్లిక్ చేయండి..