Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: అప్పుడే ఎన్నికల ప్రచారానికి రెడీ అయిన BRS ఎమ్మెల్యే.. నూతన ప్రచారం రథం రెడీ

ఎన్నికల్లో పోటీ పోటీ చేయాలనుకునే నాయకులు ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు, పాదయాత్రలతో నేతలు బిజీ అవుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మళ్ళీ తమ పార్టీ అధికారం చేజిక్కించుకుపోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ప్రజలతో మమేకం అవుతున్నారు.  

Telangana: అప్పుడే ఎన్నికల ప్రచారానికి రెడీ అయిన BRS ఎమ్మెల్యే.. నూతన ప్రచారం రథం రెడీ
Kandala Upender Reddy
Follow us
Surya Kala

|

Updated on: May 09, 2023 | 1:40 PM

తెలంగాణలో ఇంకా అసెంబ్లీ ఎన్నికల నగారా మ్రోగానే లేదు. ఎన్నికలకు ఇంకా 6 నెలలే సమయం ఉంది. అయినప్పటికీ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయ పార్టీలన్నీ సై అంటే సై అంటూ..  ఓటర్లను ఆకట్టుకునే విధంగా వివిధ పార్టీల నేతలు ప్రజాబాట పట్టారు. ఎమ్మెల్యేలు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలు ప్రజాక్షేత్రంలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల్లో పోటీ పోటీ చేయాలనుకునే నాయకులు ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నాయి. ఆత్మీయ సమ్మేళనాలు, పాదయాత్రలతో నేతలు బిజీ అవుతున్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో మళ్ళీ తమ పార్టీ అధికారం చేజిక్కించుకుపోవాలనే లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ప్రజలతో మమేకం అవుతున్నారు.

ఇటు బీఆర్‌ఎస్ లీడర్లు అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. పలు సంఘాలతో సమావేశమయ్యి.. వారి సమస్యలు సావధానంగా వింటున్నారు. అన్ని వర్గాల ప్రజలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ది పనులు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు.

ఖమ్మం జిల్లాలో ముందే ఎన్నికల ప్రచారం రథం సిద్దం చేశారు పాలేరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి. ప్రజాక్షేత్రంలో ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త జోష్‌తో రెడీ అయ్యారు. ఇప్పటికే తన ప్రచార రథాన్ని రెడీ చేయించారు. ఆ వాహనంపై సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్యే కంధాల ఉపేందర్ రెడ్డి పోటోలు ,పార్టీ స్టిక్కర్లతో నూతన ప్రచార రథాన్ని అందంగా అలంకరించారు. త్వరలో ముహుర్తం చూసుకుని తన నియోజకవర్గంలో ప్రచార రథంలో పర్యటన చేయనున్నారు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..