No Shadow Day: మీరు చూశారా.. హైదరాబాద్‌లో నీడలు మాయం.. భూమ్మీద ఈ సౌర అద్భుతం ఎలా జరిగిదంటే..
నడి వేసవి.. నడినెత్తినెక్కిన సూరీడు.. మేలో మాడు పగలగొట్టేస్తున్నాడు. సేద దీరుదామంటే నిలువ నీడ లేదంటూ వాపోయే వేడివేడి సమయం. కానీ.. నిలువ నీడ లేదనేది ఎప్పుడూ నిజం కాదు. ఏడాదిలో రెండుసార్లు మాత్రం అది నిజం. మిగతా రోజుల్లో నీడ లేకపోవడంనేది పచ్చి అబద్ధం. ఎందుకు?
ఇవాళ 12.12 గంటలకు ప్రపంచానికే షాకిచ్చే ఒక విషయం జరిగింది. విచిత్రంగా నీ నీడ నీకు దూరమైంది.. ఎలా? ఇది ప్రకృతిమాత ఇంద్రజాలమా? లేక… సైన్స్ అండ్ టెక్నాలజీ ఫలితమా..? జీరో షాడో డే… మీ నీడ మిమ్మల్ని వదిలిపెట్టే రోజు. రెండు నిమిషాల పాటు మీ నీడ మీనుంచి మాయమయ్యే రేర్ అండ్ రేరెస్ట్ డే జరిగింది. ఏడాదిలో కేవలం రెండుసార్లు మాత్రమే ఆవిష్కృతమయ్యే ఈ ఖగోళ అద్భుతానికి ఈసారి హైదరాబాద్ నగరం వేదికైంది. ఎప్పుడూ మనల్ని వెంటాడే నీడ.. మనకు దూరమవడం అనే అరుదైన అనుభూతిని ఆస్వాదించే అవకాశం కేవలం మనకు మాత్రమే దక్కింది. లెటజ్ గో ఇన్‌టూ డీటెయిల్స్.
మధ్యాహ్నం వరకు పడమర వైపు, మధ్యాహ్నం తర్వాత తూర్పు వైపు.. మనల్ని వెంటాడే నీడ మనకు తెలుసు. సూర్యుడు నడినెత్తినెక్కినప్పుడు, మిట్టమధ్యాహ్నం 12 గంటల సమయంలో కూడా ఎంతోకొంత నీడ కనిపిస్తూనే ఉంటుంది. సూర్యుడు సరిగ్గా మన పైనుంచి కాకుండా మన పక్కనుంచి జారుకుంటాడు గనుక.. అటో ఇటో ఎటోవైపు నీడ తప్పనిసరిగా కనిపిస్తుంది. కానీ.. ఏడాదిలో రెండేరెండు సందర్భాల్లో సూర్యుడు సరిగ్గా మన నెత్తి మీదకే వచ్చేస్తాడు. అంటే.. భూగ్రహం మూమెంట్‌కీ, సూర్యుడి కదలికకూ 90 డిగ్రీలతో పర్‌ఫెక్ట్ వర్టికల్ పొజిషన్ ఏర్పడుతుంది. ఆ కచ్చితమైన స్థానం ఈసారి హైదరాబాదైంది. కమాన్.. సెలబ్రేట్.. జీరో షాడో డే.. అంటూ హైదరాబాదీలు ఎంజాయ్ చేశారు.
సరిగ్గా 12 గంటలా12 నిమిషాలకు సూర్య కిరణాలు నిట్టనిలువుగా హైదరాబాద్ నగరాన్ని తాకాయి. ఈ సమయంలో ఏ వస్తువు నీడ కూడా భూమిపై పడలేదు. హైదరాబాదీలు మాత్రమే ఎక్స్‌పీరియన్స్ దక్కించుకున్నారు. మన హైదరాబాదీలకు రేరెస్ట్ అనుభవం ఇది.
ఇలా మాయమైన నీడ.. సుమారు రెండు నిమిషాల తర్వాత మళ్లీ ప్రత్యక్షమైంది. కర్కాటక రాశి నుంచి సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో సూర్యకిరణాలు ఇలా నిట్టనిలువుగా భూమిని తాకుతాయని ఖగోళ భౌతిక శాస్త్రం చెబుతోంది. ఈ ఘటన తర్వాతే ఉత్తరాయణం గతించి దక్షిణాయనం మొదలవుతుందట.
భారతీయులలో కొన్నిచోట్ల దీన్ని భాస్కర్ జయంతి పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు కూడా. మళ్లీ ఇదే ఏడాది ఆగస్టు 18న జీరో షాడే డేని ఎక్స్‌పీరియన్స్ చెయ్యొచ్చట. సో… తోడూ నీడ అనే మాట కూడా ఒక్కోసారి అబద్ధం అవుతుందన్నమాట.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం