Telangana: మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్‌కు కీలక పదవి.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ..

తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్‌కు కీలక పదవి దక్కింది. అందరు అనుకున్నట్టుగానే.. సీఎం కేసీఆర్‌కు ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం మూడేళ్ల పాటు కొనసాగుతుందని సీఎస్‌ శాంతికుమారి పేరుతో జీవో జారీ అయింది.

Telangana: మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్‌కు కీలక పదవి.. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ..
Somesh Kumar
Follow us
Shiva Prajapati

|

Updated on: May 09, 2023 | 5:36 PM

తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్‌ కుమార్‌కు కీలక పదవి దక్కింది. అందరు అనుకున్నట్టుగానే.. సీఎం కేసీఆర్‌కు ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకం మూడేళ్ల పాటు కొనసాగుతుందని సీఎస్‌ శాంతికుమారి పేరుతో జీవో జారీ అయింది.

ఆంధ్రప్రదేశ్‌ విభజనచట్టంలో భాగంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లిపోయారు సోమేష్‌ కుమార్‌. అయినా.. క్యాడర్‌ అలాట్‌మెంట్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆయన.. క్యాట్‌కు వెళ్లారు. స్టే ఆర్డర్‌తో తెలంగాణకు వచ్చారు. ఆ తర్వాత పలు పోస్టుల్లో పని చేసిన సోమేష్‌.. సీఎస్‌గా కూడా పని చేశారు. ఫైనల్‌గా హైకోర్టు సోమేష్‌ పిటిషన్‌ను కొట్టివేయడంతో.. ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. తర్జన భర్జనల మధ్య ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం సోమేష్‌కు ఎలాంటి పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. అయితే.. కొద్ది రోజుల్లోనే వీఆర్‌ఎస్‌ తీసుకొని సర్వీస్‌ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక సలహాదారునిగా నియమితులయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..