AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Healthy Food: మన బడ్జెట్‌లోనే లభించే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు.. తినండి, హెల్తీగా ఉండండి..!

స్నానం చేసిన తర్వాత జుట్టు, తిన్న తర్వాత బుగ్గలు భిన్నంగా కనిపిస్తాయి. అంటే, మీ డైట్ ఎలా ఉంటుందో, ముఖంలో మెరుపు కూడా అలాగే ఉంటుంది. మన ఆరోగ్యం కూడబెట్టిన మూలధనం కంటే తక్కువ కాదు. మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటే, మీ రాబడి మెరుగ్గా ఉంటుంది. మీరు ఎంత మంచి ఆహారం తీసుకుంటే, మీ ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది.

World Healthy Food: మన బడ్జెట్‌లోనే లభించే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు.. తినండి, హెల్తీగా ఉండండి..!
World Healthy Food
Shiva Prajapati
|

Updated on: May 07, 2023 | 7:31 AM

Share

స్నానం చేసిన తర్వాత జుట్టు, తిన్న తర్వాత బుగ్గలు భిన్నంగా కనిపిస్తాయి. అంటే, మీ డైట్ ఎలా ఉంటుందో, ముఖంలో మెరుపు కూడా అలాగే ఉంటుంది. మన ఆరోగ్యం కూడబెట్టిన మూలధనం కంటే తక్కువ కాదు. మీరు ఎంత శ్రద్ధ తీసుకుంటే, మీ రాబడి మెరుగ్గా ఉంటుంది. మీరు ఎంత మంచి ఆహారం తీసుకుంటే, మీ ఆరోగ్యం అంత మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అన్ని రకాల పోషకాలు అవసరం.

కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటంటే.. చాలా మంది సంతృప్త కొవ్వుతో కూడిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు. పనిలో బిజీగా ఉన్నామనే కారణంతో కొందరు వేళకాని వేళల్లో తింటారు. అంటే మనకు పని చేసేందుకు సమయం ఉంది కానీ తినడానికి సమయం లేదు. తొందరలో ఆకలి తీర్చుకోవడానికి ఏదైనా తింటాం. దాంతో ఆ క్షణం మన కడుపు నిండుతుంది. కానీ, అదే సకల రోగాలకు తలుపులను తెరుస్తుంది. అందుకే మీ ఆరోగ్యాన్ని బాగా ఉంచే, బడ్జెట్‌లో వచ్చే ప్రపంచంలోనే సూపర్‌ఫుడ్‌ల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం..

బాదం..

బాదం పప్పులు ప్రోటీన్లకు కేరాఫ్. బాదంలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది గుండె జబ్బులతో పోరాడడంలో సహాయపడుతుంది. రోజూ కనీసం 5 బాదంపప్పులు తినాలి. శాస్త్రవేత్తల ప్రకారం.. ఇది 97 న్యూట్రీషన్ రేటింగ్‌ను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

సముద్ర ఆహారం..

నాన్ వెజ్ ఇష్టపడే వారికి సీ ఫుడ్ వరం లాంటింది. రెడ్ స్నిపర్ ఫిష్‌లో చాలా ప్రత్యేకమైన పోషకాలు ఉంటాయి. అయితే, వాటిలో విషపూరితమైన టాక్సిన్స్ కూడా ఉన్నందున తినడానికి ముందు వాటిని పూర్తిగా శుభ్రం చేయాలి.

సిట్రస్ పండ్లు..

విటమిన్ సి ఉన్న పండ్లను సిట్రస్ పండ్లు అంటారు. వీటిలో నిమ్మ, నారింజ, మాల్టా వంటి పండ్లను పేర్కొంటారు. చర్మం, అసిడిటీ సమస్యలలో ఇవి చాలా ప్రభావవంతంగా ఉంటాయి.

దానిమ్మ..

దానిమ్మ పండులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అంతేకాదు, ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. రోజూ ఒక దానిమ్మపండు తింటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఎలాంటి ఆనారోగ్య సమస్యలు తలెత్తవు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..