Watch Video: ఎక్కడి నుంచి వచ్చింది ఇంతటి ధైర్యం! పిల్లిని పరుగులు పెట్టించిన చిట్టి ఎలుక..

హైట్, పర్సనాలిటీ అస్సలు మ్యాటరే కాదు. మనలో దమ్ము ఎంతుందనేదే మ్యాటర్. ఈ విషయంలో అనేక అంశాల్లో, అనేక సందర్భాల్లో నిరూపితమైంది. శారీరక బలవంతులు.. తమ కంటే బలహీనులను చులకనగా చూస్తారు. వారిని వేధించేందుకు ప్రయత్నిస్తారు. అయితే, బుద్ది బలం కలిగిన వారు, ధైర్యవంతులు.. తమ శక్తియుక్తులతో బలవంతులను సైతం మట్టి కరిపిస్తారు.

Watch Video: ఎక్కడి నుంచి వచ్చింది ఇంతటి ధైర్యం! పిల్లిని పరుగులు పెట్టించిన చిట్టి ఎలుక..
Rat Vs Cat
Follow us
Shiva Prajapati

|

Updated on: May 06, 2023 | 9:53 AM

హైట్, పర్సనాలిటీ అస్సలు మ్యాటరే కాదు. మనలో దమ్ము ఎంతుందనేదే మ్యాటర్. ఈ విషయంలో అనేక అంశాల్లో, అనేక సందర్భాల్లో నిరూపితమైంది. శారీరక బలవంతులు.. తమ కంటే బలహీనులను చులకనగా చూస్తారు. వారిని వేధించేందుకు ప్రయత్నిస్తారు. అయితే, బుద్ది బలం కలిగిన వారు, ధైర్యవంతులు.. తమ శక్తియుక్తులతో బలవంతులను సైతం మట్టి కరిపిస్తారు. తాజాగా ఇదే విషయాన్ని నిరూపించింది ఓ చిట్టి ఎలుక.

సాధారణంగానే పిల్లి, ఎలుక మధ్య జాతి వైరం ఉంటుంది. ఎలుక కనిపిస్తే చాలు.. గుటుక్కున మింగేయాలని చూస్తుంది పిల్లి. అందుకే, పిల్లి కనిపిస్తే చాలు.. హడలిపోతుంది. కానీ, తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ చిట్టి ఎలుక.. తనను తినడానికి వచ్చిన పిల్లిని హడలెత్తించింది. వెంటబడి తరుముతూ పరుగులు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వైరల్ వీడియోలో ఓ ఎలుక గోడ వెంట వెళ్తుంది. దీన్ని గమనించిన పిల్లి.. ఎలుకను తినాలని ట్రై చేస్తుంది. అయితే, అత్యంత ధైర్యం కలిగిన ఆ ఎలుక.. తిరిగి పిల్లినే భయపెట్టింది. చెంగు చెంగున మీదకు ఎగురుతూ, పిల్లిని హడలెత్తించింది. ఈ వీడియో చూసి నెటజిన్లు షాక్ అవుతున్నారు. సైజ్ మ్యాటర్ కాదు.. దమ్ము ఉండాలి అని కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..