AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Task: బ్రహ్మ రాతను మించింది.. దీని అర్థమేంటో ఎవరైనా చెప్పగలరా?

హ్యాండ్ రైటింగ్.. ఇదొక ఆర్ట్.. కొందరు రాసే రాత ఆణిముత్యాల్లా ఉంటాయి. చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో మరికొందరి రాత.. బ్రహ్మ దేవుడు కూడా కనిపెట్టలేనంతగా ఉంటుంది. వారు ఏం చేశారో అర్థం చేసుకోవాలంటే జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఇలాంటి రాతలను అర్థం చేసుకోవడం కూడా ఒక ఆర్ట్.

Funny Task: బ్రహ్మ రాతను మించింది.. దీని అర్థమేంటో ఎవరైనా చెప్పగలరా?
Medical Prescription
Shiva Prajapati
|

Updated on: May 04, 2023 | 2:08 PM

Share

హ్యాండ్ రైటింగ్.. ఇదొక ఆర్ట్.. కొందరు రాసే రాత ఆణిముత్యాల్లా ఉంటాయి. చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో మరికొందరి రాత.. బ్రహ్మ దేవుడు కూడా కనిపెట్టలేనంతగా ఉంటుంది. వారు ఏం చేశారో అర్థం చేసుకోవాలంటే జుట్టు పీక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే, ఇలాంటి రాతలను అర్థం చేసుకోవడం కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ అందరిలో ఉండదండోయ్.. కొందరిలో మాత్రమే ఉంటుంది. ఇలాంటి రాతల్లో ప్రముఖంగా వైద్యుల పేర్లు చెప్పాలి. అవును.. బ్రహ్మ రాతను మించి వారి రాత ఉంటుంది. ఈ రాత సదరు వైద్యులకు, మెడికల్ షాప్ వారికి తప్ప ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఉంటుంది. మెడికల్ ప్రిస్కిప్షన్‌లో వైద్యుల రాత అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది కూడా. అదే విషయం అనుకోండి. అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది వైద్యులు ఇదే తరహాలో రాస్తున్నారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. తాజాగా ఓ మెడికల్ ప్రిస్కిప్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. వైద్యులు నిజంగా దేవుళ్లు సామీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ వైరల్ అవుతున్న ప్రిస్కిప్షన్‌లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓ వాట్సాప్ యూజర్ తనకు పరిచయం ఉన్న వైద్యుడికి ఒక మెడికల్ ప్రిస్కిప్షన్ ఫోటో పంపాడు. అందులో ‘పి’ అనే అక్షరం.. ఆ వెంటనే పేద్ద గీత ఉంది. అదేంటో అర్థం కాక.. మనోడు తన పరిచయస్తుడైన వైద్యుడికి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాడు. ఇదేంటి డాక్టర్ అంటూ ప్రశ్నించాడు. టకీమని ఆ వైద్యుడు ‘పారాసిటమాల్’ అని జవాబు చెప్పాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది. ఆ గీతలో ఇంత అర్థం ఉందా అంటూ అవాక్కవుతున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న ట్వీట్‌ను కింద చూడొచ్చు..

గమనిక: ఈ వార్త ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో ఇచ్చింది కాదు. ప్రజల్లో కాస్త సరదా నింపేందుకు ఉద్దేశించి ఇవ్వడం జరిగింది. ఈ ఫన్నీ టాస్క్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనికి టీవీ9 తెలుగు బాధ్యత వహించదు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్
ప్రభాస్ లైనప్ లో ఊరిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్