Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బై మిస్టేక్‌లో కూలీ అయ్యాడు గానీ.. కొంచెం చదువుకుంటేనా ఇతని లైఫ్ ఎక్కడో ఉండేది.. ఏం తెలివిరా అయ్యా..

అసలే వేసవి కాలం.. వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఎన్ని ప్రయోగాలైనా చేసేందుకు సిద్ధపడుతాం. ఇంట్లో ఉండే వారే ఉక్కపోతను తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. అలాంటిది కూలి పని చేసే వారి ఎంత ఇబ్బంది పడుతుంటారు? ఆలోచిస్తేనే వామ్మో అనిపిస్తుంది. మనం ఇంట్లో వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి ప్రయోగాలు చేస్తామో..

Watch Video: బై మిస్టేక్‌లో కూలీ అయ్యాడు గానీ.. కొంచెం చదువుకుంటేనా ఇతని లైఫ్ ఎక్కడో ఉండేది.. ఏం తెలివిరా అయ్యా..
Desi Jugad
Follow us
Shiva Prajapati

|

Updated on: May 03, 2023 | 1:37 PM

అసలే వేసవి కాలం.. వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఎన్ని ప్రయోగాలైనా చేసేందుకు సిద్ధపడుతాం. ఇంట్లో ఉండే వారే ఉక్కపోతను తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. అలాంటిది కూలి పని చేసే వారి ఎంత ఇబ్బంది పడుతుంటారు? ఆలోచిస్తేనే వామ్మో అనిపిస్తుంది. మనం ఇంట్లో వేడి, ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి ప్రయోగాలు చేస్తామో.. బయట కూలీ పనికి వెళ్లిన వారు సైతం ఎండవేడిమిని తట్టుకోవడానికి, గాలి కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తారు. తాజాగా అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొందరు మట్టిలో మాణిక్యాల్లా ఉంటారు. బుర్ర సరిగా పని చేయాలే గానీ.. పెద్ద చదువులే చదవాల్సిన పని లేదు. అదే విషయాన్ని నిరూపించాడు ఈ వీడియోలోని వ్యక్తి. కన్‌స్ట్రక్షన్ వర్క్‌ చేస్తున్న ఓ వ్యక్తి.. మధ్యాహ్నం సమయంలో భోజనం చేసిన తరువాత కాసేపు రెస్ట్ తీసుకోవాలని భావించాడు. అయితే, నేలపై ప్లేస్ లేకపోవడం, పైగా గాలి కూడా రాకపోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలోనే అతనికి ఒక ఐడియా తట్టింది. సెంట్రింగ్ కర్రలనే దాపుగా చేసుకుని ఒక పడకను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక గాలి కోసం.. అతను చేసిన ప్రయోగం అయితే వండర్ అని చెప్పాలి.

ఇవి కూడా చదవండి

డ్రిల్లింగ్ మెషీన్‌ను ఫ్యాన్‌లా మార్చేశాడు. అవును, డ్రిల్లింగ్ మెషీన్‌కు తన షర్ట్‌ను తగిలించాడు. ఆపై ఆ డ్రిల్లింగ్ మెషీన్‌ను ఆన్ చేశాడు. ఇంకేముంది.. అది తిరుగుతుండగా ఆ షర్ట్ కూడా ఫ్యాన్ రెక్కల మాదిరిగా తిరుగుతుంది. దాంతో ఫ్యాన్‌ను మించిన గాలి వీచింది. ఈ ప్రయోగం సక్సెస్ అవగా.. అతను హాయిగా కునుకు తీశాడు. అయితే, మరికొందరు పనివారు.. అతని ప్రయోగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో అదికాస్తా వైరల్‌గా మారింది. అతని ట్యాలెంట్ చూసి ఫిదా అయిపోతున్నారు. ట్యాలెంట్ ఏ ఒక్కడి సొత్తు కాదని, కాస్త ఆలోచిస్తే అద్భుతాలు సృష్టించొచ్చని ఇతను నిరూపించాడంటూ కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

వైరల్ అవుతున్న వీడియోను కింద చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..