Black Cat: నల్ల పిల్లి ఎదురైతే శుభమా? అశుభమా? ఈ మూఢ నమ్మకం వెనుక అసలు కథ ఇదీ..!
మనం వెళ్తున్న దారిలో నల్ల పిల్లి ఎదురొస్తే అశుభమని చాలామంది నమ్ముతారు. అందుకే ఎవరైనా బయలుదేరే ముందు పిల్లి ఎదురుపడితే వెంటనే ఆగిపోతారు. కాసేపు కూర్చుని మళ్లీ లేచి బయలుదేరుతారు. ఇదంతా మన భారతదేశంలో మాత్రమే ఉంటుంది. విదేశాల్లో మాత్రం చాలా మంది పిల్లులను ఇళ్లలో ప్రేమగా పెంచుకుంటారు. మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ వస్తోంది.
మనం వెళ్తున్న దారిలో నల్ల పిల్లి ఎదురొస్తే అశుభమని చాలామంది నమ్ముతారు. అందుకే ఎవరైనా బయలుదేరే ముందు పిల్లి ఎదురుపడితే వెంటనే ఆగిపోతారు. కాసేపు కూర్చుని మళ్లీ లేచి బయలుదేరుతారు. ఇదంతా మన భారతదేశంలో మాత్రమే ఉంటుంది. విదేశాల్లో మాత్రం చాలా మంది పిల్లులను ఇళ్లలో ప్రేమగా పెంచుకుంటారు. మనదేశంలోనూ ఇప్పుడిప్పుడే ఆ ట్రెండ్ వస్తోంది. అదే వేరే విషయం. అయితే, చాలా వరకు ప్రజలు.. పిల్లి ఎదురుపడటాన్ని అశుభంగానే పరిగణిస్తారు. కొందరు పండితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పిల్లి శుభమా? అశుభమా?
పురాతన విశ్వాసాల ప్రకారం.. పిల్లులు ఇంటికి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. ఇంట్లో పెంచుకోవడం శ్రేయస్కరం కాదు. పిల్లి ఎడమ నుంచి కుడి వైపునకు కదిలితే అశుభం. కుడి నుంచి ఎడమ వైపునకు కదిలితే శుభసూచికం. ఇలా ఉన్నో భ్రమలు ప్రజల్లోఉన్నాయి. ఇక పిల్లి ఏడుపు కూడా అశుభంగా పేర్కొంటారు. ఇలాంటి అనేక అపోహలు ప్రజల్లో వ్యాప్తి చెందాయి.
అసలు కథ ఇదీ..
పూర్వకాలంలో ప్రజలు అడవి గుండా వెళ్లేవారు. రహదారులు సరిగా లేని సమయంలో నడచుకుంటూ వెళ్లేవారు. చీకట్లో సైతం ప్రయాణాలు సాగించేవారు. ఆ సమయంలో వారి దారికి పిల్లి ఎదురొస్తే వెనుక ఏదో అడవి జంతువు ఉంటుందని పసిగట్టేవారు. దాంతో వారు జాగ్రత్తపడి తమ తమ స్థానాల్లోనే నిలిచిపోయేవారు. భద్రత కలిగిన ప్రదేశాల్లో తలదాచుకునేవారు.
రాత్రి వేళ పిల్లులు వేటాడుతుంటాయి. రాత్రిళ్లు వాటి కళ్లు భయంకరంగా ఉంటాయి. గుర్రాలు, ఎద్దులపై ప్రయాణం చేసే బాటసారులు రాత్రిపూట పిల్లి కళ్లను చూసి భయపడేవారు. ఆ సమయంలో ప్రజలు తమ జంతువులను శాంతింపజేయడానికి కాసేపు ఆగిపోయేవారు. ఇది క్రమంగా మూఢవిశ్వాసంగా పరిణమించింది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు నిపుణులు, వేదాంతులు, హేతువాదులు తెలిపిన వివరాల ప్రకారం ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..