viral: అబ్బబ్బా.. ఏం వానరా బాబూ.. జీరాఫీల ఎక్స్‌ప్రెషన్ మామూలుగా లేదు మరి..!

మనం దారిలో వెళ్తుంటే సడెన్‌గా వర్షం పడితే ఏం చేస్తాం? వర్షంలో తడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఉంటే రెయిన్ కోట్ ధరిస్తాం.. గొడుగు ఉంటే వర్షానికి అడ్డుగా పెట్టుకుంటాం. అదీ లేకపోతే.. వర్షంలో తడవకుండా ఉండేందుకు ఓ షెల్టర్ చూసుకుని, దాని కింద తలదాచుకుంటాం.

viral: అబ్బబ్బా.. ఏం వానరా బాబూ.. జీరాఫీల ఎక్స్‌ప్రెషన్ మామూలుగా లేదు మరి..!
Giraffes
Follow us

|

Updated on: Apr 30, 2023 | 7:41 AM

మనం దారిలో వెళ్తుంటే సడెన్‌గా వర్షం పడితే ఏం చేస్తాం? వర్షంలో తడకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాం. ఉంటే రెయిన్ కోట్ ధరిస్తాం.. గొడుగు ఉంటే వర్షానికి అడ్డుగా పెట్టుకుంటాం. అదీ లేకపోతే.. వర్షంలో తడవకుండా ఉండేందుకు ఓ షెల్టర్ చూసుకుని, దాని కింద తలదాచుకుంటాం. వర్షం తగ్గాక బయటకు వెళతాం. కానీ, ఏదో ఒక మూలన.. వానను తిట్టుకుంటాం. ‘అబ్బా.. ఏం వానరా బాబూ.. ఇంకెప్పుడు ఆగిపోతుంది.’ అని విసుక్కుంటాం.

మనం మనుషులం కాబట్టి మనం ఇలా ఆలోచిస్తాం. మరి జంతువులు కూడా ఇలాగే ఆలోచిస్తాయా? వాటి ఆలోచన ఎలా ఉంటుంది? వర్షం వస్తే అవి ఏం చేస్తాయి? వర్షం తగ్గే వరకు ఎక్కడ ఉంటాయి? ఏదైనా షెల్టర్ చూసుకుని తలదాచుకుంటాయా? లేక వర్షంలోనే తడుస్తాయా? వీటన్నింటికి సమాధానం చెప్తున్నట్లుగా ఉన్న ఒక ఇంటస్ట్రింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా ఫిదా అయిపోతారు.

ఇవి కూడా చదవండి

@AMAZlNGNATURE పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన వీడియోలో.. జూపార్క్ పరిసర ప్రాంతంలో భారీ వర్షం కురుస్తోంది. దాంతో జూ లోని జంతువులు తమ తమ షెల్టర్లలో తలదాచుకున్నాయి. వీటిలో జీరాఫీల ఫ్యామిలీ కూడా ఉంది. కొన్ని జీరాఫీలు.. జూ పార్క్‌లో వర్షం పడుతుండగా.. గుహలాంటి ప్రదేశంలో సేద తీరాయి. వర్షాన్ని తెరిపారా చూస్తూ..నిల్చున్నాయి. ఈ వర్షం ఇంకెప్పుడు తగ్గుతుందిరా బాబూ అన్నట్లుగా తెరిపారా చూస్తూ నిలబడ్డాయి. ఈ బ్యూటీఫుల్ సన్నివేశాన్ని కొందరు తమ ఫోన్ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ వీడియోను షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారి నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..