Delhi Metro: వీళ్లంతా ఒక్కటే బ్యాచ్.. మెట్రోలో ఓపెన్‌గా గలీజ్ పనులు.. ఎందుకు పుడుతారో ఏంటో..?

‘కమా తురాణా నభయం నలజ్జ’ ఈ పదం అనేకసార్లు వినే ఉంటారు. అంటే.. కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి సిగ్గు, ఎగ్గూ, భయం, భక్తి ఏవీ ఉండవు అని అర్థం. ఈ మధ్య కాలంలో చాలా మంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నామా? ప్రైవేట్ ప్లేస్‌లో ఉన్నామా? అనే సోయే లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా కొందరు ప్రేమికుల తీరు సభ్యసమాజం..

Delhi Metro: వీళ్లంతా ఒక్కటే బ్యాచ్.. మెట్రోలో ఓపెన్‌గా గలీజ్ పనులు.. ఎందుకు పుడుతారో ఏంటో..?
Delhi Metro
Follow us

|

Updated on: Apr 29, 2023 | 2:24 PM

‘కమా తురాణా నభయం నలజ్జ’ ఈ పదం అనేకసార్లు వినే ఉంటారు. అంటే.. కామంతో కళ్లు మూసుకుపోయిన వారికి సిగ్గు, ఎగ్గూ, భయం, భక్తి ఏవీ ఉండవు అని అర్థం. ఈ మధ్య కాలంలో చాలా మంది విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఉన్నామా? ప్రైవేట్ ప్లేస్‌లో ఉన్నామా? అనే సోయే లేకుండా బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా కొందరు ప్రేమికుల తీరు సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. సిగ్గు ఎగ్గూ లేకుండా.. అందరు చూస్తుండగానే.. ఓపెన్ ప్లేస్‌లో చేయకూడని పనులు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమైన ఘటనలు దేశ రాజధాని మెట్రోలో ఎన్నో వెలుగు చూస్తున్నాయి.

ఇటీవలి కాలంలో ఢిల్లీ మెట్రో రైళ్లలో ప్రేమికులు, కొందరు కామాంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. చుట్టూ జనాలు ఉన్నారనే సోయి కూడా లేకుండా బహిరంగంగా రొమాన్స్ చేయడం, హద్దులు దాటి ప్రవర్తించడం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వారి చర్యలు మెట్రోలో ప్రయాణించే మిగతా ప్రయాణికులకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ప్రేమికులు చేసే చిల్లర పనులపై ప్రయాణికులు ఢిల్లీ మెట్రో అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో ఢిల్లీ మెట్రో అధికారులు స్పందించారు. ఈ మేరకు ప్రయాణికులను అభ్యర్థిస్తూ ఓ ట్వీట్ చేసింది. మెట్రోలో ప్రయాణించే వారు.. తమను తాము నియంత్రించుకోవాలని కోరింది. సామాజిక మర్యాదలు పాటించాలని కోరింది. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించరాదని అభ్యర్థించింది. ఎవరైనా ప్రయాణికులు అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే డీఎంఆర్‌సీ హెల్ప్ లైన్ నెంబర్‌కు కంప్లైంట్ ఇవ్వాలని, సదరు వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..