Bizarre: వీడికి ఒకటి కాదు.. రెండున్నాయ్.. అప్పుడే పుట్టిన పిల్లగాడిని చూసి అవాక్కైన డాక్టర్స్..

వింత జీవి జననం.. వింత శిశువు జననం.. అనే వార్తలు మనం చాలాసార్లు వినే ఉంటాం. అయితే, అవన్నీ.. రెండు తలల శిశువు, నాలుగు కాళ్ల శిశువు, ఇద్దరు శిశువులు అతికి పుట్టడం వంటివి విన్నాం.. చూశాం. అది జంతువుల్లోనూ జరిగింది.. ఇటు మనుషుల్లోనూ వెలుగు చూసింది.

Bizarre: వీడికి ఒకటి కాదు.. రెండున్నాయ్.. అప్పుడే పుట్టిన పిల్లగాడిని చూసి అవాక్కైన డాక్టర్స్..
Baby
Follow us

|

Updated on: Apr 28, 2023 | 9:49 PM

వింత జీవి జననం.. వింత శిశువు జననం.. అనే వార్తలు మనం చాలాసార్లు వినే ఉంటాం. అయితే, అవన్నీ.. రెండు తలల శిశువు, నాలుగు కాళ్ల శిశువు, ఇద్దరు శిశువులు అతికి పుట్టడం వంటివి విన్నాం.. చూశాం. అది జంతువుల్లోనూ జరిగింది.. ఇటు మనుషుల్లోనూ వెలుగు చూసింది. అయితే, ఇప్పుడు చెప్పబోయే.. మీరు వినబోయే వార్త మాత్రం బహు విచిత్రమైన వార్త. అవును.. ఓ శిశువు రెండు పురుషాంగాలతో జన్మించాడు. ఈ శిశువుని చూసి డాక్టర్స్ అవాక్కయ్యారు. పాకిస్తాన్‌లో వెలుగు చూసిన ఘటన.. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పాకిస్తాన్‌లో ఓ ఆస్పత్రిలో మహిళకు వైద్యులు ప్రసవం చేయగా.. బాబు జన్మించాడు. వాడిని చూస్తే రెండు పురుషాంగాలు ఉన్నాయి. పిల్లాడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని, రెండు భాగాల నుంచి మూత్ర విసర్జన చేస్తున్నాడని వైద్యులు తెలిపారు. ఈ పురుషాంగాలు పరిమాణంలోనూ విచిత్రంగా ఉన్నాయని చెబుతున్నారు వైద్యులు. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉందంటున్నారు. ఇలా పుట్టిన చిన్నారులను ఇప్పటి వరకు చూడలేదని అంటున్నారు. ప్రస్తుతం బాబు ఆరోగ్యంగానే ఉన్నాడని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.

ముఖ్యమైన అవయవం లేదు..

ఈ వింత చిన్నారికి సంబంధించిన వివరాలను.. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్ రిపోర్ట్స్‌లో కూడా ప్రస్తావించారు. అయితే, ఈ పిల్లాడికి మలద్వారం లేదని, ఫలితంగా మల విసర్జన చేయలేకపోయాడని పేర్కొన్నారు. దాంతో వైద్యులు అతనికి శస్త్ర చికిత్స చేసి మలం విసర్జించేలా రంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

డెఫాలియా అంటారు..

వైద్య పరిభాషలో ఇటువంటి పరిస్థితిని డిఫాలియా అని పిలుస్తారు. 60 లక్షల మందిలో ఇలాంటి కేసు ఒక్కటే కనిపిస్తుందని, ఇప్పటి వరకు చరిత్రలో ఇలాంటివి 100 కేసులు తెరపైకి వచ్చాయని నివేదికలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మొదటి కేసు 1609 సంవత్సరంలో తెరపైకి వచ్చింది. మలనిషిలో రెండు ప్రైవేట్ పార్ట్స్‌ ఎందుకు అభివృద్ధి చెందుతాయో వైద్యులు ఇంకా కనిపెట్టలేకపోయారు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..