AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vending Machine: ఇక మెడికల్ షాప్‌కి వెళ్లి సిగ్గు పడాల్సిన పనిలేదు.. ఒక్క బటన్ నొక్కితే చాలు అవి వచ్చేస్తాయ్..!

సెక్స్, శృంగారం అనే పదాలు, భావన మన దేశంలో ఇప్పటికీ పెద్ద బూతులుగా, నిషిద్ధమైనవిగా భావిస్తారు. అందుకే సెక్స్ విషయంలో చాలా మంది మొహమాటపడుతుంటారు. సెక్స్‌కు సంబంధించిన అంశాలను ఇతరుల వద్ద ప్రస్తావించాలన్నా తటపటాయిస్తారు. వాస్తవానికి శృంగారంపై అవగాహన కలిగి ఉండాలని ప్రతి వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

Vending Machine: ఇక మెడికల్ షాప్‌కి వెళ్లి సిగ్గు పడాల్సిన పనిలేదు.. ఒక్క బటన్ నొక్కితే చాలు అవి వచ్చేస్తాయ్..!
Condom Vending Machine
Shiva Prajapati
|

Updated on: Apr 27, 2023 | 1:47 PM

Share

సెక్స్, శృంగారం అనే పదాలు, భావన మన దేశంలో ఇప్పటికీ పెద్ద బూతులుగా, నిషిద్ధమైనవిగా భావిస్తారు. అందుకే సెక్స్ విషయంలో చాలా మంది మొహమాటపడుతుంటారు. సెక్స్‌కు సంబంధించిన అంశాలను ఇతరుల వద్ద ప్రస్తావించాలన్నా తటపటాయిస్తారు. వాస్తవానికి శృంగారంపై అవగాహన కలిగి ఉండాలని ప్రతి వైద్యులు, ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఇందులో తప్పేమీ లేదని, పైగా సురక్షితంగా ఉండేందుకు, సమస్యల పరిష్కారానికి దోహపడుతుందని చెబుతున్నారు. కానీ.. ప్రజల్లో మాత్రం మార్పు రావటం లేదు.

ఇక సెక్స్ ద్వారా ఎలాంటి లైంగిక వ్యాధులు సంక్రమించకుండా, సురక్షితంగా ఉండేందుకు కండోమ్స్ వాడాలని వైద్యులు, ప్రభుత్వాలు విపరీతమైన ప్రచారం చేస్తున్నారు. కండోమ్స్ వాడకంపై టీవీల్లో, పేపర్లలో అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ కండోమ్స్ వాడకంపై మొహమాటంతో కూడిన భావన కలిగి ఉన్నారు. మెడికల్ షాప్‌కి వెళ్లి కండోమ్స్ తీసుకోవాలంటే భయపడిపోతుంటారు. మనం కొన్నిసార్లు చూస్తేనే ఉంటాం.. చాలా మంది మెడికల్ షాప్‌నకు వచ్చి కండోమ్స్ కావాలని అడాగాలంటే ఆగమాగం అయిపోతుంటారు. ఎవరైనా ఉన్నారా? ఎలా అడగాలి? ఇప్పుడెలా? అని ఆత్మన్యూనతా భావనలోకి వెళతారు.

అయితే, ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే.. ఇద్దరు మెకానికల్ ఇంజనీర్లు కండోమ్ వెండింగ్ మెషీన్‌ను కనిపెట్టారు. ఈ మెషీన్‌ను గుజరాత్‌లోని సూరత్‌లో ఏర్పాటు చేశారు. సూరత్ నగరంలోని దభోలీ చార్ రాస్తాలో గల శ్యామ్ మెడికల్‌లో వెండింగ్ మెషిన్‌ ఇన్‌స్టాల్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ వెండింగ్ మెషీన్‌ను ఉపయోగించడం కూడా చాలా ఈజీ అంటున్నారు మేకర్స్. మెడికల్ షాప్‌కి వెళ్లి.. అక్కడి వ్యక్తులను అడగాల్సిన పని లేకుండా.. నేరుగా మెషీన్ ద్వారా తీసుకోవచ్చు. మెషిన్‌లో నాలుగు రకాల కండోమ్స్ అందుబాటులో ఉంటాయి. మెషీన్‌లో కండోమ్ బాక్స్‌ల ఫోటోలు ఉంటాయి. వాటి కింద ఒక బటన్ ఉంటుంది. ఎన్ని కావాలనే నెంబర్ కూడా ఉంటుంది. అవి నొక్కితే చాలు కండోమ్స్ వచ్చేస్తాయి. ఇక పేమెంట్స్ కోసం మెషీన్‌ స్క్రీన్ పై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దానిని స్కాన్ చేయడం ద్వారా పే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ పూర్తవగానే.. కండోమ్స్ మెషీన్ నుంచి బయటకు వస్తాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..