AP Weather Report: తగ్గేదే లే అంటున్న వరణుడు.. ఇవాళ కూడా భారీ వర్షాలు.. ముఖ్యంగా ఈ జిల్లాల్లో..
తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. సమయం కాని సమయంలో విరుచుకుపడుతూ జనాలకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు. ముఖ్యంగా రైతుల కంట కన్నీరు మిగుల్చుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న జనాలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఇవాళ కూడా వర్షాలు పడే వీలుందని ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలను వరుణ దేవుడు వణికిస్తున్నాడు. సమయం కాని సమయంలో విరుచుకుపడుతూ జనాలకు ఇబ్బందులు కలిగిస్తున్నాడు. ముఖ్యంగా రైతుల కంట కన్నీరు మిగుల్చుతున్నాడు. ఇప్పటికే భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న జనాలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. ఇవాళ కూడా వర్షాలు పడే వీలుందని ప్రకటించింది. పశ్చిమ విదర్భ నుండి మరాట్వాడా మీదుగా దక్షిణ కర్ణాటక వరకు వ్యాపించిన ఉపరితల ఆవర్తనంతో జోరుగా వర్షాలు పడుతున్నాయి. సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు..
ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉత్తర, దక్షిణ కోస్తాలో పలు చోట్ల వర్షాలు పడుతాయని తెలిపింది. రాయలసీమలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.
As expected, Massive Thunderstorms with Hail storms (వడగండ్లు) is spreading along #Srikakulam district from Odisha side. Places between Tekkali – Sompeta will see Heavy Downpour with Intense Lightning. One more thunderstorm close to Gajapathinagaram in #Vizianagaram district will… pic.twitter.com/3jsNY6aJmA
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) April 25, 2023
Massive rains in #Kurnool city and also many parts of Kurnool and Nandyal districts as Wind Confluence zone triggered powerful Thunderstorms. Yemmiganur, Kurnool 135 mm is the highest in the state today and now the rains are pushed into #Nandyal district. It will keep continuing…
— Andhra Pradesh Weatherman (@APWeatherman96) April 26, 2023
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..