Electric Cars: సూపర్ ఎలక్ట్రిక్ కార్స్.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 857 కిలోమీటర్లు వెళ్లొచ్చు..
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు కస్టమర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దేశంలో క్రమంగా ఈవీ లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం కూడా EVలను ప్రోత్సహిస్తోంది. ఈవీ వినియోగాన్ని పెంచడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మీరు కూడా త్వరలో కొత్త ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. ఎక్కువ మైలేజీ వచ్చే, లాంగ్ డ్రైవింగ్ రేంజ్ కలిగిన కొన్ని మోడళ్ల కార్లను మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఆ కార్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

BYD Atto 3..
భారత మార్కెట్‌లో ఈ కారు ధర రూ. 33.99 లక్షలు(ఎక్స్ షోరూమ్). ఈ కారు స్పెషల్ ఎడిషన్ మోడల్ ధర రూ.34.49 లక్షలు(ఎక్స్ షోరూమ్). ఇక ఫీచర్స్ అయితే అదుర్స్ అనాల్సిందే. 7 ఎయిర్‌బ్యాగ్స్, హిల్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, EBDతో కూడిన ABS, 360 డిగ్రీ కెమెరా వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. డ్రైవింగ్ రేంజ్ గురించి చెప్పాలంటే.. ఈ కారు పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 521కిమీ (ARAI సర్టిఫికేట్) లాంగ్ రేంజ్ వస్తుంది.
Mercedes Benz EQS..
మెర్సిడెస్ నుండి వచ్చిన ఈ ఎలక్ట్రిక్ కారు ఫీచర్లు వావ్ అనేలా ఉంది. సూపర్ డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 857 కిలోమీటర్ల (ARAI సర్టిఫికేట్) డ్రైవింగ్ రేంజ్‌ని అందిస్తుంది. భద్రత పరంగా ఈ కారులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, ADAS సపోర్ట్ ఇస్తుంది. ఈ కారు ధర 1.59 కోట్లు (ఎక్స్ షోరూమ్).
MG ZS EV..
MG మోటార్స్ ఈ కారులో ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ అనే రెండు వేరియంట్‌లను విడుదల చేసింది. ఈ మోడళ్ల ధరలు వరుసగా రూ. 23.38 లక్షలు(ఎక్స్ షోరూమ్), రూ.27.40 లక్షలు(ఎక్స్ షోరూమ్). ఇక ఫీచర్స్, డ్రైవింగ్ రేంజ్ విషయానికొస్తే.. ఈ కారులో EBDతో కూడిన ABS, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా మొదలైన అనేక ఉపయోగకరమైన ఫీచర్లు ఉన్నాయి. ఈ కారు బ్యాటరీని ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల వరకు సపోర్ట్ చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..