Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bizarre: బాప్‌రే.. ఈ ‘పీత’కు అతీంద్రీయ శక్తులున్నాయా?.. క్షణాల్లో మగ జీవిని ఆడ జీవిగా మార్చేస్తోంది..

ఎదుటివారిని తమ మాటల్లో బంధించి తమ పని తాము పూర్తి చేసుకునేవారు ఎందరో ఉంటారు. ఇందుకోసం వారు చాలా తెలివితేటలను ప్రదర్శిస్తారు. అలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాలను మాత్రమే చూస్తారు. ఇతరుల భావోద్వేగాలను పట్టించుకోరు. అయితే, ఇలాంటి జిమ్మిక్కులు, నక్కజిత్తుల తెలివితేటలు మనుషులే కాదు.. ఇతర జీవరాశులు కూడా ప్రదర్శిస్తాయి.

Bizarre: బాప్‌రే.. ఈ ‘పీత’కు అతీంద్రీయ శక్తులున్నాయా?.. క్షణాల్లో మగ జీవిని ఆడ జీవిగా మార్చేస్తోంది..
Crab
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 23, 2023 | 6:52 AM

ఎదుటివారిని తమ మాటల్లో బంధించి తమ పని తాము పూర్తి చేసుకునేవారు ఎందరో ఉంటారు. ఇందుకోసం వారు చాలా తెలివితేటలను ప్రదర్శిస్తారు. అలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాలను మాత్రమే చూస్తారు. ఇతరుల భావోద్వేగాలను పట్టించుకోరు. అయితే, ఇలాంటి జిమ్మిక్కులు, నక్కజిత్తుల తెలివితేటలు మనుషులే కాదు.. ఇతర జీవరాశులు కూడా ప్రదర్శిస్తాయి. అవును, మీరు చదవివేది నిజంగా నిజం. ఉదాహరణకు, కాకి గూడులో గుడ్లు పెట్టే కోకిల. ఇది కాకుండా, ప్రస్తుతం మరొక జీవి కూడా తానున్నానంటూ ముందుకొచ్చింది. అదే ఎండ్రకాయ. ఇది మరొక జీవిని తన సంతానం కోసం ఉపయోగించుకుంటోంది. అది కూడా ఒక మగ ఎండ్రకాయను తన సంతానానికి ఎంచుకోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందుకు సంబంధించి పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

‘Sacculina carcini’ పరాన్నజీవి. ఇదొక ఎండ్రకాయ జాతి జీవి. దీనిపై ఆడిటీ సెంట్రల్, The Conversation వెబ్‌సైట్‌లో ఆసక్తికర కథనం ప్రచురించారు. దీని ప్రకారం, ఇది మరొక జీవి శరీరాన్ని తన అవసరానికి వాడుకుంటుంది. ఏకంగా ఆ జీవి శరీరాన్ని తన సంతానానికి ఆవాసంలా మార్చేస్తుంది. ఆ జీవిని పూర్తిగా నియంత్రించి తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటుంది.

ఎలా నియంత్రిస్తుందంటే..

వాస్తవానికి, ఈ జీవులు తమ ప్రత్యేక ఇంద్రియాలతో సదరు పీతలను ముందుగా గుర్తిస్తాయి. దానిని తన తెలివితేటలతో నియంత్రిస్తుంది. ఏకంగా అది మగ పీతతో సంగమిస్తుంది. తన మూలాలను ఆ పీతలోకి వదిలేస్తుంది. ఆ మూలాలు మగ పీత శరీరాన్ని నియంత్రిస్తుంది. ఏకంగా దాని లింగాన్ని కంట్రోల్ చేస్తుంది. మగ పీత కాస్త ఆడ పీతలా మారిపోయి, ప్రవర్తిస్తుంటుంది. అలా మగ పీత కడుపులో ఈ కన్నింగ్ పీత గుడ్లు పెరుగి, వాటి వారసత్వానికి జన్మనిస్తాయి.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ జీవికి సంబంధించి ఓ పరిశోధన తెరపైకి వచ్చింది. ఈ పరాన్నజీవి వల్ల మగ పీతల్లో అండాశయాలు అభివృద్ధి చెందుతున్నాయని, పీతల లింగమార్పిడి కారణంగా అవి తమ పిల్లలకు జన్మనివ్వలేకపోతున్నాయని అందులో పేర్కొన్నారు. దీని కారణంగా వాటి జనాభాలో చాలా క్షీణత ఉంది.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..