Personal Loan: ఆధార్ కార్డు ఉంటే చాలు.. 5 నిమిషాల్లో మీకు రూ.2 లక్షల వరకు లోన్ వస్తుంది.. ఎలా అంటే?
పర్సనల్ లోన్ తీసుకోవాలంటే అదో పెద్ద టాస్క్‌లా ఉంటుంది. చిరునామా వివరాలు, ఆస్తి విలువ, సంపాదన వివరాలు సహా అనేక డాక్యూమెంట్స్‌ని సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడంటే మధ్యవర్తులు చూసుకుంటున్నారు గానీ, ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండేది.
పర్సనల్ లోన్ తీసుకోవాలంటే అదో పెద్ద టాస్క్‌లా ఉంటుంది. చిరునామా వివరాలు, ఆస్తి విలువ, సంపాదన వివరాలు సహా అనేక డాక్యూమెంట్స్‌ని సమర్పించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడంటే మధ్యవర్తులు చూసుకుంటున్నారు గానీ, ఇంతకు ముందు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండేది. అయినప్పటికీ.. పర్సనల్ లోన్ పొందడం అంత ఈజీ ఏమీ కాదు. అయితే, ఇప్పుడు ఈ దళారులు, ఏజెంట్స్‌తో పని లేకుండానే పర్సనల్ లోన్‌ను పొందే మార్గం ఒకటి ఉంది. దాని ద్వారా ఇంట్లో కూర్చునే రూ. 2 లక్షల వరకు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. మరి ఆ మార్గమేంటో ఇప్పుడు మేం మీకు చెప్పబోతున్నాం.
జస్ట్ ఆధార్ కార్డుతో ఇంట్లో కూర్చునే రూ. 2 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. ఈ-కేవైసీ ద్వారా ఈ ప్రాసెస్ మరింత సులభమయ్యింది. ఆన్‌లైన్ ద్వారా పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆధార్ సోర్స్ లోన్ బ్యాంక్స్: ఆధార్ కార్డ్ సహాయంతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయడం చాలా సులభం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి అనేక బ్యాంకుల కస్టమర్‌లు కేవలం ఆధార్ కార్డ్‌తో రుణాలను పొందవచ్చు. దీంతో పాటు, మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే, మీ క్రెడిట్ స్కోర్ తప్పనిసరిగా 750 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. క్రెడిట్ స్కోర్ బాగుంటే ఆధార్ కార్డు ద్వారా రూ. 2 లక్షల వరకు రుణం పొందే వీలుంటుంది. మీ అప్లికేషన్ 5 నిమిషాల్లో ఆమోదించబడి, డబ్బు మీ అకౌంట్‌లో జమ అవుతుంది.
ఆధార్ కార్డ్ ద్వారా పర్సనల్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి:
1. ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి లోన్ కోసం దరఖాస్తు చేయడానికి ముందుగా మీ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
2. బ్యాంక్ మొబైల్ యాప్‌ని ఉపయోగించి కూడా పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
3. యాప్ ఓపెన్ చేసిన తరువాత ఓటీపీ ఆధారంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
4. ఆ తరువాత, పర్సనల్ లోన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
5. లోన్ మొత్తం, ఇతర అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
6. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ వివరాలను కూడా సమర్పించాలి. మీరు ఇచ్చిన సమాచారాన్ని బ్యాంక్ ధృవీకరిస్తుంది. ఆ తర్వాత, మీ లోన్ ఆమోదించబడినట్లయితే, ఆ మొత్తం డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..