AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అమ్మ బాబోయ్.. పెళ్లి వేదికపైనే వరుడిని పొట్టు పొట్టు కొట్టిన వధువు.. వీడియో చూస్తే షాక్..

‘వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా.. ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా’ అంటూ మన్మధుడు సినిమాలో హీరో నాగార్జున పాడిన పాట పెళ్లైన మగాళ్లు ఎప్పటికీ పాడుకుంటూనే ఉంటారు. కారణం వారు పడే అవస్థలు. పెళ్లి తరువాత ఇబ్బందులు తప్పవని పెళ్లైన మగవాళ్ల బాధకు నిదర్శనం..

Viral Video: అమ్మ బాబోయ్.. పెళ్లి వేదికపైనే వరుడిని పొట్టు పొట్టు కొట్టిన వధువు.. వీడియో చూస్తే షాక్..
Copule Fighting
Shiva Prajapati
|

Updated on: Apr 21, 2023 | 6:32 AM

Share

‘వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా.. ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా’ అంటూ మన్మధుడు సినిమాలో హీరో నాగార్జున పాడిన పాట పెళ్లైన మగాళ్లు ఎప్పటికీ పాడుకుంటూనే ఉంటారు. కారణం వారు పడే అవస్థలు. పెళ్లి తరువాత ఇబ్బందులు తప్పవని పెళ్లైన మగవాళ్ల బాధకు నిదర్శనం ఆ పాట. పెళ్లి తరువాత బాధ్యతలు, బాధలు, కష్టాలు, సుఖాలు అన్నీ ఉంటాయి. వాటిని తట్టుకుని నిలబడేవారు హ్యాపీగా ఉంటారు. లేదంటే పైన పాట పాడుకుంటారు.

అది అటుంచితే.. తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పెళ్లికి ముందే ఇలా ఉంటే.. కాపురం మొదలుపెట్టాక ఏంటి వారి పరిస్థితి అని ఆశ్చర్యపోతున్నారు నెటిజనులు. అవును, మరి.. పెళ్లి వేదికపైనే వధువరులు ఇద్దరూ పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. స్టేజీపై వరుడు వధువుకి స్వీట్ తినిపస్తున్నాడు. అయితే, బలవంతంగా తినిపించడం ఆ వధువుకి నచ్చలేదు. వదులురా బాబూ అంటూ పెల్లుమంటూ చెంప మీద ఒక్కటిచ్చింది. ఇక వరుడు ఊరుకుంటాడు. ఆయన గారూ ఓ రెండు ఎక్కువే ఇచ్చాడు. ఆ ఫైటింగ్ కాస్తా.. ముష్టి యుద్ధంగా మారింది. జుట్లు జుట్లు పట్టుకుని ఇద్దరూ పొట్టు పొట్టుగా కొట్టుకున్నారు. మిగతా వారు వారిని విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఇద్దరిలో ఎవరూ తగ్గలేదు. ఆఖరికి వధువు అయితే.. ఆ వరుడిని కింద పడేసి మరీ తన్నింది. ఈ సీన్‌ను పెళ్లికి వచ్చిన బంధువులు తమ కెమెరాలో రికార్డ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

వధువు, వరుడు కొట్టుకున్న వైనం చూసి నెటిజన్లు బిత్తరపోతున్నారు. ఇలాంటి పరిస్థితి ఉంటుందనే.. వద్దు రా సోదరా అనే పాట రాసి ఉంటారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోను మీరూ చూసేయండి.

వైరల్ వీడియోను కింద చూడొచ్చు..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..