AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ‘కుక్కర్’కి మరకలు పోవట్లేదా? ఇలా చేయండి.. చిటికెలో కొత్తదానిలా మెరిసిపోతుంది..

ప్రస్తుత కాలంలో కుక్కర్ లేని వంట గది లేదని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అన్నం మొదలు, కూర వరకు అన్ని రకాలుగా కుక్కర్‌ను వినియోగిస్తుంటారు జనాలు. అయితే, అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఈ కుక్కర్‌ని శుభ్రం చేయడం అంటే పెద్ద టాస్క్‌లా ఉంటుంది. ఒక్కోసారి దానిపై పడిన మరకలను తొలగించాలంటే కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది.

Kitchen Hacks: ‘కుక్కర్’కి మరకలు పోవట్లేదా? ఇలా చేయండి.. చిటికెలో కొత్తదానిలా మెరిసిపోతుంది..
Cooker
Shiva Prajapati
|

Updated on: Apr 20, 2023 | 6:21 AM

Share

ప్రస్తుత కాలంలో కుక్కర్ లేని వంట గది లేదని బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. అన్నం మొదలు, కూర వరకు అన్ని రకాలుగా కుక్కర్‌ను వినియోగిస్తుంటారు జనాలు. అయితే, అన్ని రకాలుగా ఉపయోగపడుతున్న ఈ కుక్కర్‌ని శుభ్రం చేయడం అంటే పెద్ద టాస్క్‌లా ఉంటుంది. ఒక్కోసారి దానిపై పడిన మరకలను తొలగించాలంటే కష్టపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కొన్నిసార్లు ఆ మరకు ఎంతకీ పోవు కూడా. మరి కుక్కర్‌పై ఉన్న మొండి మరకలను ఎలా తొలగించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ టిప్స్‌తో కుక్కర్‌కి ఎన్ని మరకలు ఉన్నా.. ఎంత మురికిగా ఉన్నా ఇట్టే శుభ్రమవుతుంది. కొత్త దానిలా మెరిసిపోతుంది.

బేకింగ్ సోడాతో..

కుక్కర్‌లో కూర చేసినప్పుడు అంచుల వెంట కూర మరకలు అంటుతాయి. ఈ మరకలను తొలగించాలంటే బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపిన పేస్ట్‌తో రుద్దాలి. 5 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తరువాత క్లీన్ చేయాలి. కూర మరకలు అన్నీ తొలగిపోతాయి.

వెనిగర్..

పప్పు గానీ, బంగాళదుంపలు ఉడకబెట్టినప్పుడు కుక్కర్ అడుగు భాగంలో తెల్లటి పొరలాంటి మరక ఏర్పడుతుంది. దీనిని తొలగించడానికి వెనిగర్‌ని వాడొచ్చు. కుక్కర్‌లో వెనిగర్‌ను కొంత వేసి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం కడగితే, క్లీన్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

డిష్ సోప్‌, గోరువెచ్చని నీళ్లు..

కుక్కర్ పై ఉండే రబ్బర్‌ని క్లీన్ చేయడానికి డిష్ సోప్‌ని గోరువెచ్చని నీటిలో నానబెట్టి క్లీన్ చేయాలి. ఇక్కడ మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఈ రబ్బర్‌ని ప్రతి 18 – 20 నెలలకు ఓసారి ఖచ్చితంగా మార్చాలి.

నిమ్మరసం..

కొన్ని కొన్నిసార్లు కుక్కర్‌కు అంటిన మరకలు చాలా మొండిగా ఉంటాయి. ఎంత క్లీన్ చేసిన పోవు. అలాంటి మరకలకు నిమ్మరసం బాగా పని చేస్తుంది. ముందుగా కుక్కర్‌లో నిమ్మరసం వేయాలి. ఓ 15 నుంచి 20 నిమిషాల వరకు మరిగించాలి. ఆ తరువాత డిష్ వాష్‌తో క్లీన్ చేయాలి.

వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్‌..

కుక్కర్‌ మరకలను వెనిగర్, డిష్‌వాష్ లిక్విడ్ కలిపి గోరువెచ్చని నీటితో క్లీన్ చేయొచ్చు. ఇలా చేస్తే త్వరగా మరకలు పోతాయి.

వేడినీళ్లు..

కుక్కర్‌లో నీరు పోసి 15 నిమిషాలు సిమ్‌లో పెట్టి వేడి చేయండి. కాసేపు చల్లార్చాలి. ఆ తరువాత డిష్ వాష్‌ లిక్విడ్‌తో క్లీన్ చేయాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..