AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brain Tumor: ఈ అలవాట్లు వెంటనే మానుకోండి.. లేదంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంది..!

ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ట్యూమర్స్‌ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ ట్యూమర్స్ బ్రెయిన్‌లోనే కాకుండా, శరీరంలో అనేక చోట్ల వస్తాయి. అయితే, బ్రెయిన్‌లో వస్తే మాత్రం చాలా ఇబ్బందికరం. ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. సాధారణంగా ఈ ట్యూమర్స్ వంశపారంపర్య వ్యాధులు, జీన్స్, అయోనైజింగ్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ వంటి కారణాల వల్ల వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Brain Tumor: ఈ అలవాట్లు వెంటనే మానుకోండి.. లేదంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ఛాన్స్ ఉంది..!
Brain Health
Shiva Prajapati
|

Updated on: Apr 20, 2023 | 6:19 AM

Share

ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ట్యూమర్స్‌ బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ ట్యూమర్స్ బ్రెయిన్‌లోనే కాకుండా, శరీరంలో అనేక చోట్ల వస్తాయి. అయితే, బ్రెయిన్‌లో వస్తే మాత్రం చాలా ఇబ్బందికరం. ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి. సాధారణంగా ఈ ట్యూమర్స్ వంశపారంపర్య వ్యాధులు, జీన్స్, అయోనైజింగ్ రేడియేషన్ ఎక్స్‌పోజర్ వంటి కారణాల వల్ల వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, వీటితో పాటు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు వల్ల కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. మరి బ్రెయిన్ ట్యూమర్‌కు కారణమయ్యే ఆ పొరపాట్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బ్రెయిన్ ట్యూమర్‌కు, బ్రెయిన్ క్యాన్సర్‌కు కారకాలు..

1. సెల్‌ఫోన్: సెల్‌ఫోన్‌ ఎక్కువగా వాడితే బ్రెయిన్‌ ట్యూమర్‌ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఫోన్ నుంచి విడుదల అయ్యే రేడియేషన్ కారణంగా ట్యూమర్స్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. అందుకే ఫోన్ మాట్లాడటం తగ్గించాలని, ఒకవేళ మాట్లాడినా సాధ్యమైనంత వరకు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుకోవాలని సూచిస్తున్నారు.

2. ఆహారం, జీవనశైలి: మనం అనుసరించే జీవన శైలి, ఆహారపు అలవాట్లు కూడా బ్రెయిన్ ట్యూమర్‌కు కారణాలవుతాయి. అధికంగా కొవ్వు పదార్థాలు తినడం వల్ల ట్యూమర్ ముప్పు పెరుగుతుంది. స్మోకింగ్, శారీరక శ్రమ లేకపోవడం వల్ల, జంక్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

3. రసాయనాల ఎఫెక్ట్స్: పురుగుమందులు, పారిశ్రామిక రసాయనాలకు ఎక్స్‌పోజ్‌ అవ్వడం వల్ల బ్రెయిన్ ట్యూమర్ ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా కెమికల్‌ ఫ్యాక్టరీలలో పనిచేసే వారికి, పారిశ్రామిక ప్రాంతాల సమీపంలో నివసించే వారికి బ్రెయిన్‌ ట్యూమర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

4. హార్మోన్లు: బ్రెయిన్ ట్యూమర్ సమస్యకు హర్మోన్లు కూడా కారణం అని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలం పాటు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకునే వారికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. అలాగే, టెస్టోస్టెరాన్ రీప్లేస్మెంట్‌ థెరపీ చేయించుకున్న వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఉందంటున్నారు.

ట్యూమర్స్ ఎలా ఏర్పడుతాయి..

నియంత్రణ అనేదే లేకుండా, అసాధారణంగా కణాలు పెరిగిపోవటాన్ని ట్యూమర్‌‌‌ అంటారు. కణాలన్నీ ఒక ముద్దలా, కాయలా తయారవుతాయి. సాధారణంగా మన శరీరంలోని కణాలు ఒక దశకు వచ్చాక చనిపోతాయి, వీటిని భర్తీ చేయటానికి కొత్త కణాలు పుడతాయి. కొన్నిసార్లు పాత, దెబ్బతిన్న కణాలు మరణించకపోయినా వాటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి. ఇవే ఒకదగ్గర పోగుపడుతూ చివరికి ట్యూమర్‌లా మారతాయి. ఈ ట్యూమర్లు ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతాయి.

గమనిక: వైద్య నిపుణులు తెలిపిన వివరాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఈ వ్యాసంలో ఇవ్వడం జరిగింది. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించి, వారి సలహాలు, సూచనల మేరకు చికిత్స తీసుకోండి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
శ్రీవారి భక్తులకు హెచ్చరిక! వీఐపీ దర్శనం పేరుతో మోసపోకండి
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..
టాస్ గెలిచిన రాజస్థాన్.. ప్లేయింగ్ 11లో కీలక మార్పులు..