Health Tips: చపాతీ ఉదయం తింటే మంచిదా? రాత్రి తింటే మంచిదా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది..!

మనం దేశంలో చాలా మంది అన్నంతో పాటు రోటీ, చపాతీలు కూడా తింటారు. కొందరు ఆరోగ్యం దృష్ట్యా అన్నానికి బదులుగా చపాతీ, రోటీలను తింటారు. ముఖ్యంగా ఉదయం గానీ, రాత్రి వేళల్లో గానీ చపాతీలను తినేవారు చాలా మందే ఉన్నారు. అయితే, ఇక్కడ చాలా మందికి ఒక సందేహం ఉంది. అదేంటంటే.. చపాతీ, రోటీని రాత్రిపూట తింటే ప్రయోజనమా? లేక ఉదయం వేళ తింటే ప్రయోజనకరమా?. మరి దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Health Tips: చపాతీ ఉదయం తింటే మంచిదా? రాత్రి తింటే మంచిదా? తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఇది..!
Chapathi
Follow us

|

Updated on: Apr 18, 2023 | 10:24 PM

మనం దేశంలో చాలా మంది అన్నంతో పాటు రోటీ, చపాతీలు కూడా తింటారు. కొందరు ఆరోగ్యం దృష్ట్యా అన్నానికి బదులుగా చపాతీ, రోటీలను తింటారు. ముఖ్యంగా ఉదయం గానీ, రాత్రి వేళల్లో గానీ చపాతీలను తినేవారు చాలా మందే ఉన్నారు. అయితే, ఇక్కడ చాలా మందికి ఒక సందేహం ఉంది. అదేంటంటే.. చపాతీ, రోటీని రాత్రిపూట తింటే ప్రయోజనమా? లేక ఉదయం వేళ తింటే ప్రయోజనకరమా?. మరి దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

రాత్రిపూట చపాతీ/రోటీ తింటే ఇన్ని అనర్థాలా?

చపాతీ లో చాలా కేలరీల శక్తి ఉంటుంది. కారణం అందులో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి వేళ రొట్టె తినడం వల్ల అది అధిక బరువుకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. అందులోని చక్కెర స్థాయిల కారణంగా శరీరంలో షుగలర్ లెవెల్స్ పెరుగుతాయని చెబుతున్నారు. అందుకే రాత్రి ఆహారం రోటీ, చపాతీ తినడం అంత క్షేమం కాదని నిపుణులు చెబుతున్నారు.

ఒక చిన్న రోటీలో 71 కేలరీల శక్తి ఉంటుంది. రాత్రి భోజనం 2 రోటీలు తింటే 140 కేలరీల శక్తి శరీరానికి అందుతుంది. ఇక ఈ రోటీ తో పాటు కూరగాయలు, సలాడ్ కూడా తీసుకుంటారు. తద్వారా శరీరానికి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అందుతాయి. దీని కారణంగా బరువు వేగంగా పెరుగుతుంది. ఇక రాత్రి తిన్న తరువాత నడవకపోతే బరువు వేగంగా పెరగడమే కాకుండా, ఆరోగ్యం కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

దుష్ప్రభావాలు..

– రాత్రిపూట చపాతీ/రోటీ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది.

– మధుమేహం, పీసీఓడీ సమ్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

– జీర్ణ క్రియను నెమ్మదింపజేస్తాయి.

– రాత్రి వేళ చపాతీ/రోటీకి బదులుగా పండ్లు, పీచు పదార్థాలు తినడం ఉత్తమం.

– ఒకేవళ రాత్రి వేళ చపాతీ/రోటీ తిన్నా రెండు మించి తినకూడదు.

– ఉదయం వేళ చపాతీ తినడం చాలా బెటర్ అని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఈ వార్తలో పేర్కొన్న అంశాలు నిపుణుల సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు. ఏవైనా సందేహాలుంటే వైద్యుల సలహా మేరకు డైట్ పాటించాల్సిందిగా సూచన.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..