AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాచరిక వ్యాధి అంటే ఏంటో తెలుసా? దాని వల్ల వచ్చే ఇబ్బందులను తెలుసుకోండి

Hemophilia Disease: హీమోఫిలియా అనేది ఒక జన్యుపరమైన రుగ్మత అని వైద్యులు చెబతున్నారు. ఇది శరీరం రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. దీంతో చిన్న గాయాల నుంచి కూడా అధిక రక్తస్రావం కావచ్చు. రక్తస్రావం రుగ్మత కొన్ని గడ్డకట్టే కారకాల లోపం వల్ల సంభవిస్తుంది. ఈ వ్యాధి పురుషులలో సర్వసాధారణంగా ఉంటుదని నిపుణులు పేర్కొంటున్నారు.

రాచరిక వ్యాధి అంటే ఏంటో తెలుసా? దాని వల్ల వచ్చే ఇబ్బందులను తెలుసుకోండి
Red Blood Cells
Nikhil
|

Updated on: Apr 18, 2023 | 10:30 PM

Share

మనలో చాలా మందికి చిన్నపాటి గాయానికే అధిక రక్తస్రావం అవుతుంది. ముఖ్యంగా ఆ రక్తస్రావం కూడా ఓ పట్టాన కంట్రోల్ అవ్వదు. అయితే ఇలాంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి హిమోఫిలియా అనే వ్యాధితో బాధపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. హీమోఫిలియా అనేది ఒక జన్యుపరమైన రుగ్మత అని వైద్యులు చెబతున్నారు. ఇది శరీరం రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. దీంతో చిన్న గాయాల నుంచి కూడా అధిక రక్తస్రావం కావచ్చు. రక్తస్రావం రుగ్మత కొన్ని గడ్డకట్టే కారకాల లోపం వల్ల సంభవిస్తుంది. ఈ వ్యాధి పురుషులలో సర్వసాధారణంగా ఉంటుదని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా హీమోఫిలియా కుటుంబ చరిత్ర ఉన్న వ్యక్తులు వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.. 19, 20వ శతాబ్దాల్లో ఇంగ్లండ్, జర్మనీ, రష్యా, స్పెయిన్‌లోని రాజ కుటుంబాలను ఈ వ్యాధి ప్రభావితం చేసినందున హిమోఫిలియాను రాచరిక వ్యాధి అని పిలుస్తుంటారు. ఇంగ్లండ్ రాణి విక్టోరియా తన తొమ్మిది మంది పిల్లలలో ముగ్గురికి ఈ వ్యాధి సోకిందని చెబుతారు. అయితే ఈ వ్యాధి లక్షణాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.

దీర్ఘకాలిక రక్తస్రావం

హేమోఫిలియా ఉన్న వ్యక్తులు శస్త్రచికిత్స, దంత ప్రక్రియలు లేదా చిన్న కోతలు లేదా గీతలు తర్వాత కూడా సుదీర్ఘ రక్తస్రావం అనుభవించవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. 

కీళ్ల నొప్పులు, వాపు

కీళ్లలోకి పదేపదే రక్తస్రావం జరగడం వల్ల నొప్పి, వాపు, దృఢత్వం ఏర్పడవచ్చు, ముఖ్యంగా మోకాలు, చీలమండలు, మోచేతులలో ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్య సాయం పొందాలి.

ఇవి కూడా చదవండి

ముక్కు నుంచి రక్తస్రావం

తరచుగా లేదా ఎక్కువ కాలం ముక్కు నుంచి రక్తం కారడం హేమోఫిలియాకు సంకేతంగా వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే అలర్ట్ కావాలి.

మూత్రం లేదా మలంలో రక్తం

జీర్ణశయాంతర లేదా మూత్ర నాళంలో రక్తస్రావం హిమోఫిలియా ఉన్న వ్యక్తులలో కూడా సంభవించవచ్చు, ఇది మలం లేదా మూత్రంలో రక్తానికి దారి తీస్తుంది. అయితే మూలశంఖ వల్ల కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయని గుర్తుంచుకోవాలి.

గాయాలు

లోతైన గాయాలు లేదా తేలికైన నుంచి అధిక రక్తస్రావం హిమోఫిలియా లక్షణమని వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు కూడా సులభంగా. తరచుగా గాయపడుతున్నట్లు అనుభూతి చెందుతారు. అయితే ఇది వారిలో ఉన్న వ్యాధి లక్షణమే అని నిపుణులు పేర్కొంటున్నారు. 

రోగ నిర్ధారణ, చికిత్స

ఒక వ్యక్తిలో ఇలాంటి సంకేతాలు, లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. రోగనిర్ధారణ సాధారణంగా రక్తం గడ్డకట్టే కారకాల స్థాయిలను కొలవడానికి రక్త పరీక్షలను నిర్వహించాలని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ చికిత్సలో గడ్డకట్టే కారకాలను పునరుద్ధరించడానికి రీప్లేస్‌మెంట్ థెరఫీ చికిత్సను కూడా వైద్యులు పాటించే అవకాశం ఉంది. 

గమనిక: పైన పేర్కొన్న వివరాలు వైద్య నివేదికలు, ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..