Blood Rich Foods: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా? ఇవి తింటే నెల రోజుల్లోనే అద్దిరిపోయే రిజల్ట్స్ కనిపిస్తుంది..!
శరీరంలో రక్తహీనత అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. రక్తహీనత అనేది భారతీయ మహిళల్లో ఒక సాధారణ సమస్య. సాధారణంగా స్త్రీల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం..

శరీరంలో రక్తహీనత అనేది ఈ రోజుల్లో సాధారణ సమస్యగా మారింది. రక్తం లేకపోవడాన్ని రక్తహీనత అంటారు. రక్తహీనత అనేది భారతీయ మహిళల్లో ఒక సాధారణ సమస్య. సాధారణంగా స్త్రీల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం 12 నుండి 16 గ్రాములకు ఒక dl ఉంటుంది. పురుషులలో 14 నుండి 18 గ్రాములకు ఒక dl హిమోగ్లోబిన్ ఉంటుంది. శరీరంలో ఈ మొత్తం కంటే తక్కువగా ఉన్నప్పుడు, అది రక్తహీనతకు సంకేతంగా పరిగణించబడుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఆకలిగా అనిపించదు, బలహీనంగా ఉంటారు. తక్కువ హృదయ స్పందన ఉంటుంది. ప్రజలలో రక్తహీనత ఫిర్యాదులు ఎక్కువగా కామెర్లు, పైల్స్, మహిళల్లో ప్రమాదం సమయంలో, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరుగుతుంది. మీరు కూడా రక్తహీనతతో బాధపడుతున్నట్లయితే, కొన్ని ఇంటి నివారణలతో రక్తహీనతను నివారించవచ్చు. వీటిని తినడం వల్ల రక్తహీనత దూరం అవుతుందని, రక్తహీనత నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
యాపిల్, బీట్‌రూట్ రసం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆపిల్, బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం లోపాన్ని నివారించవచ్చు. రోజూ ఒక కప్పు యాపిల్, అరకప్పు బీట్‌రూట్ రసం తాగడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.
పాలు, నువ్వులు తీసుకోవడం..
రక్తహీనత సమస్య ఉంటే.. పాలతో నల్ల నువ్వులు కలిపి త్రాగాలి. ఇందుకోసం నల్ల నువ్వులను రెండు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత నువ్వుల ముద్దలా చేసుకోవాలి. ఒక చెంచా నువ్వుల ముద్దను తేనె, పాలతో కలిపి సేవించాలి. ఇలా చేయడం వల్ల రక్తహీనత సమస్య తొలగిపోతుంది.




బచ్చలికూర..
ఆకుకూరలు పోషకాలతో నిండి ఉంటాయి. బచ్చలికూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే బచ్చలికూర తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బచ్చలి కూర సూప్ తీసుకోవడం రక్తహీనత సమస్యను తగ్గించడంలో ఉపకరిస్తుంది.
ఎండు ద్రాక్ష..
రక్తహీనతను తొలగించడానికి ఎండుద్రాక్ష, ఎండిన రేగుపళ్లు కూడా తినొచ్చు. వీటిని తినడం వల్ల రక్తహీనత సమస్య త్వరగా తగ్గుతుంది.
గమనిక: పైన పేర్కొన్న వివరాలు వైద్య నివేదికలు, ఆరోగ్య నిపుణుల సూచనల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..