AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona: కొత్తగా 1000కి పైగా కరోనా కేసులు .. కొత్త గైడ్ లైన్స్ జారీ.. యాంటీబయాటిక్స్ వాడకంపై ఏమి చెప్పిందంటే

దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నివారణ చర్యలు మొదలు పెట్టింది ప్రభుత్వం. సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది, యాంటీబయాటిక్స్ వాడకంపై కొన్ని సూచనలు చేసింది. 

Corona: కొత్తగా 1000కి పైగా కరోనా కేసులు .. కొత్త గైడ్ లైన్స్ జారీ..  యాంటీబయాటిక్స్ వాడకంపై ఏమి చెప్పిందంటే
Corona Virus
Surya Kala
|

Updated on: Mar 20, 2023 | 7:37 AM

Share

దేశంలో కరోనా కేసులు  హఠాత్తుగా పెరగడం ప్రారంభించాయి. రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. కరోనా సోకిన బాధితుల కోసం.. ముఖ్యంగా పెద్దల కోసం ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ కొత్త గైడ్‌లైన్‌లో అనేక అంశాలను దృష్టిలో ఉంచుకోవాలని కోరింది.

సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. భౌతిక దూరం పాటించాలని, ఇంటి లోపల మాస్క్‌లను వాదాలని సూచించింది.  చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరింది. అంతేకాదు కొన్ని లక్షణాలు అంటే హైడ్రేషన్ వంటివి కనిపిస్తే.. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలని తెలిపింది. డాక్టర్‌లతో టచ్‌లో ఉండటంతో పాటు ఆక్సిజన్‌ను సదుపాయాల పై దృష్టి పెట్టాలని సూచించింది.

ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలంటే  గైడ్‌లైన్‌లో చెప్పిన ప్రకారం.. ఎవరికైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక జ్వరం లేదా విపరీతమైన దగ్గు ఉంటే.. ఈ లక్షణాలు ఐదు రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితే.. వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అదే సమయంలో.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాని మార్గదర్శకాల్లో యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిషేధించింది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. బ్యాక్టీరియా సంక్రమణ అదుపులో ఉంటే యాంటీబయాటిక్స్ వాడకూడదు.

ఇవి కూడా చదవండి

అధిక ప్రమాదం ఉన్న రోగులకు ఏమి చేయాలి

గైడ్‌లైన్‌లో, హై-రిస్క్ పేషెంట్లు రెమ్‌డెసివిర్‌ను కూడా ఐదు రోజుల పాటు తీసుకోవాలని కోరింది. మొదటి రోజున 200 mg IV, తర్వాత 4 రోజులకు 100 mg IV తీసుకోవాలని సూచించింది. భారతదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు ప్రభుత్వ ఆందోళనను పెంచాయి. గత గురువారం మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక అనే ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. లేఖలో, ఈ రాష్ట్రాలు పరీక్ష, ట్రాక్, చికిత్స , టీకాపై దృష్టి పెట్టాలని సూచించింది.

24 గంటల్లో దేశంలో 1071 కొత్త కేసులు గత 24 గంటల్లో భారతదేశంలో 1071 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనాతో ముగ్గురు చనిపోయారు. 129 రోజుల తర్వాత దేశంలో ఒక్కరోజులో 1000కు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న రోగుల సంఖ్య 5915కి పెరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..