AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gun Firing: రోడ్డుమీద పోలీసు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపిన యువకుడు.. షాక్ తిన్న ప్రజలు

ఢిల్లీ పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ షహ్దారా రద్దీగా ఉన్న ప్రాంతంలో పోలీసులు తమ వ్యాన్ నిలిపారు. అక్కడ  రోడ్డుపై వాహనాల రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొంతమంది రోడ్డుపక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి పరుగున వచ్చి పిస్టల్ చూపిస్తూ కాల్పులు జరుపాడు. 

Gun Firing: రోడ్డుమీద పోలీసు తుపాకీ లాక్కొని కాల్పులు జరిపిన యువకుడు.. షాక్ తిన్న ప్రజలు
Delhi Police
Surya Kala
|

Updated on: Mar 18, 2023 | 9:45 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తూర్పు ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో రోడ్డుపై నడుస్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా పోలీసు పిస్టల్‌ను లాక్కున్నాడు. వెంటనే ఆ  పిస్టల్ తో పోలీసులతో పాటు జనంపైకి కాల్పులు జరిపాడు. అయితే..  కొద్దిసేపటికే పోలీసులు జనం సాయంతో దుండగుడిని పట్టుకున్నారు. పోలీసుల విచారణలో.. ఆ వ్యక్తి హర్‌దేవ్‌పురి, షహదారాలో అద్దె ఇంట్లో నివసిస్తున్నట్లు తేలింది. కాల్పుల ఘటనకు ముందు…  ఆ వ్యక్తి కత్తితో తనను తాను పొడుచుకున్నాడు. ఆ గాయాలతో రోడ్డుమీదకు పరుగెత్తుకుంటూ వచ్చి..  షహదారా ప్రాంతంలోని నాథూ కాలనీ చౌక్‌కు చేరుకున్నాడు.

ఢిల్లీ పోలీసుల పిసిఆర్ వ్యాన్‌లో ఉన్న పోలీసు సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే  అతను పోలీసు దగ్గర ఉన్న పిస్టల్ లాక్కొని ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. తర్వాత ఎలాగోలా జనం సాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణలో.. 29 ఏళ్ల కృష్ణ షెర్వాల్ షాహదారాలో ఢిల్లీ అద్దెకు నివసిస్తున్నట్లు తేలిందని పోలీసులు చెప్పారు. సంఘటనకు ముందు కృష్ణ వంటగదిలో కత్తితో గొంతు కోసుకుని, గాయపడిన స్థితిలో తన గదికి తాళం వేసి.. ఆ తాళాలు తన ఇంటి యజమానికి ఇచ్చాడు.గాయం నుంచి రక్తం కారుతున్నా కృష్ణ పరిగెడుతూ నాథూ కాలనీ చౌక్‌కు చేరుకున్నాడు.

ఇవి కూడా చదవండి

సాయంత్రం 6.15 గంటల ప్రాంతంలో పబ్లిక్ ఏఎస్ఐ జితేంద్ర పన్వార్ ఆ యువకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో లో ఆ యువకుడు కత్తితో ఏఎస్ఐ జితేంద్ర చేతికి గాయం చేశాడు. డిఫెన్స్‌ చేస్తున్న సమయంలో ఆ యువకుడు ASI అధికారిక పిస్టల్‌ని లాక్కొని ఒక రౌండ్ కాల్చాడు. ఈ క్రమంలో అంకుర్ అనే 25 ఏళ్ల యువకుడు ధైర్యం చేసి విక్రమ్‌ను పట్టుకున్నాడు. అనంతరం అక్కడికక్కడే ఉన్న ఏఎస్‌ఐ జితేంద్ర, వ్యక్తులు అతడిని పట్టుకుని .. ఆ యువకుడి వద్ద ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఢిల్లీ పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ షహ్దారా రద్దీగా ఉన్న ప్రాంతంలో పోలీసులు తమ వ్యాన్ నిలిపారు. అక్కడ  రోడ్డుపై వాహనాల రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కొంతమంది రోడ్డుపక్కన నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి పరుగున వచ్చి పిస్టల్ చూపిస్తూ కాల్పులు జరుపాడు.

కాల్పులతో రోడ్డుపై గందరగోళం  రోడ్డుమీద అకస్మాత్తుగా కాల్పులు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు . ఒక్కసారిగా సంఘటన స్థలంలో గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయాందోళనకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు.    రోడ్డుపై కొంత సేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆ యువకుడు అటూ ఇటూ పరిగెడుతూ రోడ్డుపై ఉన్న వ్యక్తులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే ఈ కాల్పుల ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆ యువకుడిని పోలీసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..