Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పరీక్షలు సరిగ్గా రాయలేదని ఆత్మహత్య చేసుకున్న బాలిక.. అంబులెన్స్ లేక చెల్లెలు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లిన అన్న.. ఎక్కడంటే? ..

అరగంటకు పైగా ఎదురు చూసినా అంబులెన్స్ దొరక్కపోవడంతో మృతురాలి సోదరుడు ఆమె మృతదేహాన్ని బైక్‌పైనే దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబీకులు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు

Viral News: పరీక్షలు సరిగ్గా రాయలేదని ఆత్మహత్య చేసుకున్న బాలిక..  అంబులెన్స్ లేక చెల్లెలు మృతదేహాన్ని బైకుపై తీసుకెళ్లిన అన్న.. ఎక్కడంటే? ..
Brother Carries Sister Dead
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2023 | 8:46 AM

ఉ త్తర్‌ప్రదేశ్‌లో అమానవీయ ఘటన వెలుగుచూసింది. చికిత్స పొందుతూ మరణించిన ఓ యువతి మృత దేహాన్ని ఇంటికి తరలించడానికి అంబులెన్స్ లేకపోవడంతో.. ఆ యువతి అన్న బైక్ ను ఆశ్రయించాడు. రోడ్డుమీద వెళ్తున్న సమయంలో ఎవరో ఆ సన్నివేశాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇలా దాపు దాదాపు 10 కి.మీ. ప్రయాణించాడు. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని   కౌశంబి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని కోఖ్‌రాజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్వారీ మున్సిపాలిటీలోని అంబేద్కర్ నగర్‌లో 17 ఏళ్ల నిరాషా దేవి అనే బాలిక ఇంటర్ పరీక్షలు సరిగ్గా రాయలేదని.. మార్కులు సరిగ్గా రావంటూ ఆందోళనకు గురైంది. ఆహారం తినడం మానేసింది..  అంతేకాదు ఇంట్లో ఒంటిరిగా ఉన్న సమయంలో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. వెంటనే చికిత్స నిమిత్తం మంజన్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ తరలించగా.. అప్పటికే నిరాషా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

చెల్లెలు మృత దేహాన్ని ఇంటికి తిరిగి తీసుకుని వెళ్ళడానికి అంబులెన్స్‌ ఏర్పాటుచేయాలని ఆసుపత్రి సిబ్బందిని కోరాడు అన్న కుల్దీప్. అరగంటకు పైగా ఎదురు చూసినా అంబులెన్స్ దొరక్కపోవడంతో మృతురాలి సోదరుడు ఆమె మృతదేహాన్ని బైక్‌పైనే దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించి ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబీకులు జిల్లా పోలీసులకు సమాచారం అందించారు

ఇవి కూడా చదవండి

అంబులెన్స్‌ సౌకర్యం లేకపోవడంతో కుటుంబీకులు ఆసుపత్రి అధికారులతో గొడవకు దిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇరువర్గాలు మాటల తూటాలు విసురుకున్నారు. మంజ్‌పూర్ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని ఉద్రిక్తతను అదుపులోకి తెచ్చారు.

పోలీసులు నిరాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై విమర్శలు రావడంతో జిల్లా కలెక్టర్‌ స్పందించారు. విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. జిల్లా మేజిస్ట్రేట్ సుజిత్ కుమార్ మాట్లాడుతూ ఈ సంఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని.. దర్యాప్తు ఆధారంగా అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..