Inspiring Story: మీరు గ్రేట్ సార్.. పీహెచ్‌డీ పట్టాపుచ్చుకుని.. చిన్ననాటి కలను 79 ఏళ్లలో నెరవేర్చుకున్న ప్రొఫెసర్

2017లో ప్రభాకర్ బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరారు. అక్కడ విజిటింగ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఐదు సంవత్సరాల తరువాత అతను తన "చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు

Inspiring Story: మీరు గ్రేట్ సార్.. పీహెచ్‌డీ పట్టాపుచ్చుకుని.. చిన్ననాటి కలను 79 ఏళ్లలో నెరవేర్చుకున్న ప్రొఫెసర్
Prabhakar Kuppahalli
Follow us

|

Updated on: Mar 16, 2023 | 12:39 PM

ఏదైనా సాధించాలంటే.. వయసు ఒక మేటర్ మాత్రమే.. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు ఒక  ప్రొఫెసర్. నాలుగు దశాబ్దాలుగా ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రభాకర్ కుప్పహళ్లి బెంగళూరు వాసి. మంగళూరు విశ్వవిద్యాలయం 41వ వార్షిక స్నాతకోత్సవంలో ప్రభాకర్ తన 79 వ ఏట మెటీరియల్ సైన్స్‌లో పిహెచ్‌డి అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇది చిరకాల వాంఛ అని చెప్పారు. తాను చిన్నతనంలో పిహెచ్‌డి చేయాలని నిర్ణయించుకున్నానని.. అయితే కొన్ని , అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఇక యుఎస్‌లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మళ్ళీ  పిహెచ్‌డి చేయాలని కోరుకున్నానని అప్పుడు కూడా కుదరలేదని చెప్పారు. అయితే తన  75 ఏళ్లు వయసులో మళ్ళీ పిహెచ్‌డి చేయాలని నిర్ణయించుకున్నాను, ”అని  ప్రభాకర్ చెప్పారు.

2017లో ప్రభాకర్ బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో చేరారు. అక్కడ విజిటింగ్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఐదు సంవత్సరాల తరువాత అతను తన “చిరకాల కోరికను నెరవేర్చుకున్నారు “.  మెకానికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ R కేశవమూర్తి .. గైడ్ అయ్యారు. ప్రభాకర్ కల నెరవేర్చుకునే విధంగా అన్ని విధాలా అండగా నిలిచారు. ప్రభాకర్ పీహెచ్‌డీ లేకుండా విజిటింగ్ ఫ్యాకల్టీ మెంబర్..  అయితే పరిశోధనలో అతన్ని ఎవరూ బీట్ చేయలేరని కేశవమూర్తి చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్రభాకర్ 1944 కు చెందిన పాతకాలపు వ్యక్తి.. అయితే ఓ వైపు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తూనే.. మరోవైపు పరిశోధన సమయంలో రాసిన థీసిస్ ను  అగ్ర సైన్స్ జర్నల్స్‌లో ప్రచురణకు పంపించేవారు.

ప్రభాకర్ 1966లో IISc బెంగుళూరు నుండి ఇంజనీరింగ్ పట్టాపుచ్చుకున్నారు. IIT బొంబాయిలో కొన్ని సంవత్సరాలు పని చేసి.. తర్వాత US వెళ్ళారు. 1976లో పిట్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి  చేసి.. 15 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. అనంతరం  భారతదేశానికి తిరిగి వచ్చారు. ప్రభాకర్ భార్య పుష్పప్రభ గృహిణి కాగా, వారి కుమారుడు ఐటీ ప్రొఫెషనల్.ప్రభాకర్ పీహెచ్‌డీ చేస్తూ.. తన వయస్సు సాకుగా తీసుకుని ఎలాంటి అదనపు సౌకర్యాలు కోరలేదని  గైడ్ ..మంగళూరు యూనివర్సిటీ ఫ్యాకల్టీ చెప్పారు. ఇతర అభ్యర్థుల మాదిరిగానే సాధారణ స్టూడెంట్ గానే ప్రవర్తించారని గుర్తు చేసుకున్నారు. తాను ఈరోజు పిహెచ్‌డి అందుకోవడంలో ముఖ్య పాత్ర గైడ్ ఆర్ కేశవమూర్తి అంటూ గుర్తు చేసుకున్నారు ప్రభాకర్.

మరిన్ని జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..