AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో 1,610 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరో 1,610 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ మార్చి 14 (మంగళవారం) ఉత్తర్వులు..

AP Govt Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. మరో 1,610 పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు
Andhra Pradesh
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2023 | 9:54 PM

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరో 1,610 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ మార్చి 14 (మంగళవారం) ఉత్తర్వులు జారీచేసింది. కొత్తగా ఏర్పడే 88 పీహెచ్‌సీలలో 1,232 పోస్టులు, ప్రస్తుతం ఉన్న పీహెచ్‌సీలకు అనుబంధంగా ఏర్పాటు చేయనున్న 63 పీహెచ్‌సీల్లో 378 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీచేశారు.

ఈ మేరకు ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ రామిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టుల్లో డాక్టర్‌, హెల్త్‌ సూపర్‌వైజర్‌ తదితర పోస్టులు ఉన్నాయన్నారు. ఆయా పోస్టులకు జిల్లాలవారీగా నియామకాలు చేపడుతామని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.