Journalist Arrest: మంత్రిని ప్రశ్నించినందుకు జర్నలిస్టు అరెస్టు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియోలు

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్థానాలు నెరవేర్చలేదని మంత్రిని ప్రశ్నించిన జర్నలిస్టును అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది..

Journalist Arrest: మంత్రిని ప్రశ్నించినందుకు జర్నలిస్టు అరెస్టు.. నెట్టింట వైరల్‌ అవుతోన్న వీడియోలు
Arrest
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 15, 2023 | 4:04 PM

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్థానాలు నెరవేర్చలేదని మంత్రిని ప్రశ్నించిన జర్నలిస్టును అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. యూపీలోని సంభాల్‌లోని బుద్ధనగర్ ఖండ్వా గ్రామంలో మార్చి 11న చోటుచేసుకుంది. గ్రామంలో చెక్ డ్యామ్ శంకుస్థాపన కార్యక్రమానికి మంత్రి గులాబ్ దేవి హాజరయ్యారు. అనంతరం గ్రామ ప్రజలతో మాట్లాడుతుండగా సంజయ్ రాణా అనే స్థానిక జర్నలిస్టు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్థానాలు, అభివృద్ధి పనులపై ప్రశ్నించాడు. వందలాడి మంది గ్రామస్థుల సమక్షంలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మంత్రి గులాబ్ దేవి ఇచ్చిన వాగ్ధానాలు ఇంకా నెరవేర్చలేదని, గ్రామస్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, అభివృద్ధి పనులను గుర్తు చేశాడు. గ్రామంలో రోడ్లు, ఆలయానికి ప్రహరీ గోడ, కళ్యాణ మండపాలు, పబ్లిక్‌ టాయిలెట్ల నిర్మాణాలు వంటి అభివృద్ధిపనులపై గులాబ్ దేవి చేసిన వాగ్దానాలను అతను గుర్తు చేశాడు. ఇంతలో గ్రామస్థులు కూడా సంజయ్ రాణాకు మద్ధతు పలికారు.

సభా వేదికపై మంత్రితోపాటు ఉన్న ఇతర నాయకులు జర్నలిస్టు సంజయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ విషయాలు చర్చించేందుకు ఇది సందర్భం కాదంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. సమావేశం అనంతరం స్థానిక బీజేపీ యువజన నాయకుడు శుభం రాఘవ్ కార్యక్రమం ముగిసిన తర్వాత జర్నలిస్టుపై దాడి చేయడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా మంత్రిని దుర్భాషలాడాడని, కార్యక్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారంటూ జర్నలిస్టుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇవి కూడా చదవండి

దీంతో పోలీసులు సంజయ్ రాణాపై ఐపీసీ సెక్షన్ 323, 506, 504 కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి సీఆర్‌పీసీ సెక్షన్ 151 కింద అరెస్ట్ చేశారు. రెండు రోజుల పాటు స్టేషన్‌లోనే ఉంచారు. సాధారణంగా తీవ్రమైన కేసుల్లో మాత్రమే పోలీసులు వారెంట్ లేకుండానే నిందితులను అరెస్టు చేసేందుకు ఈ సెక్షన్‌ను ఉపయోగిస్తారు. అరెస్టయిన జర్నలిస్టు మంత్రి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలిగించలేదని, గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్నించాడని ఆ ఊరి ప్రజలు బీబీసీ విలేకరికి తెలిపారు. దీనిపై పోలీసులను ప్రశ్నించగా మంత్రి ఆదేశాల మేరకే సంజయ్‌ రాణాను అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.