AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

H3N2:పెరుగుతున్న H3N2 కేసులు, పుదిచ్చేరిలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ

దేశంలో పలు చోట్ల హెచ్3ఎన్2 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారు 7 మంది చనిపోవడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పుదిచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

H3N2:పెరుగుతున్న H3N2 కేసులు, పుదిచ్చేరిలో పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విద్యాశాఖ
Virus
Aravind B
|

Updated on: Mar 15, 2023 | 3:54 PM

Share

దేశంలో పలు చోట్ల హెచ్3ఎన్2 కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ వ్యాధి బారిన పడిన వారు 7 మంది చనిపోవడం భయబ్రాంతులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో పుదిచ్చేరి విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్‌ఫ్లుయెంజా వ్యాప్తి కొనసాగుతున్నందున పది రోజులపాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. అన్ని పాఠశాలలో 8వ తరగతి వరకు సెలవులు ఇస్తున్నామని.. మార్చి 16 నుంచి 24వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు పుదుచ్చేరిలో మార్చి 11 నాటికి 79 ఇన్‌ఫ్లుయెంజా కేసులు నమోదయ్యాయి. . కేసుల సంఖ్య పెరిగితే చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఇన్‌ఫ్లుయెంజా కేసులకు సంబంధించి ప్రత్యేక కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ఈ క్రమంలో ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి వెల్లడించారు.

కొవిడ్‌ తరహా లక్షణాలున్న ఈ ఇన్‌ఫ్లుయెంజా కేసులతో శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడి ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ ఇటీవల వెల్లడించాయి. జనవరి 2 నుంచి మార్చి 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 451 హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు నమోదయినట్టు అటు కేంద్ర ఆరోగ్యశాఖ కూడా తెలిపింది. ఈ సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజా కారణంగా కర్ణాటక, హరియాణా, గుజరాత్‌లో సహా పలు రాష్ట్రాల్లో మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..