AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Third Child: మూడో బిడ్డను కంటే రూ.50 వేల ఫిక్సిడ్ డిపాజిట్.. ఎక్కడో కాదు భారత్‌లోనే..

ఇద్దరు పిల్లలున్న దంపతులు మూడో బిడ్డకు కూడా జన్మనివ్వండని డబ్బులిచ్చిమరీ ప్రోత్సహిస్తున్నారు. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. మన దేశంలో..

Third Child: మూడో బిడ్డను కంటే రూ.50 వేల ఫిక్సిడ్ డిపాజిట్.. ఎక్కడో కాదు భారత్‌లోనే..
3rd Child Incentive
Srilakshmi C
|

Updated on: Mar 14, 2023 | 8:45 PM

Share

ఇద్దరు పిల్లలున్న దంపతులు మూడో బిడ్డకు కూడా జన్మనివ్వండని డబ్బులిచ్చిమరీ ప్రోత్సహిస్తున్నారు. ఇదెక్కడో విదేశాల్లో అనుకుంటే పొరపాటే. మన దేశంలోని రాజస్థాన్‌లో ఈ విధంగా నజరానాలు ఇచ్చిమరీ జననాలను ప్రోత్సహిస్తున్నారు. అదేంటి మన దేశంలో ఇప్పటికే అధిక జనాభా ఉంది.. ఇక్కడ జనాభాకొరత ఏంటని అనుకుంటున్నారా? ఐతే మీరు ఈ విషయం తెలుసుకోవల్సిందే..

రాజస్థాన్‌ రాష్ట్రంలోని పుష్కర్‌లోని మహేశ్వరి కమ్యునిటీ నిర్ణయం తీసుకుంది. మహేశ్వరి కమ్యునిటీలో జనాభా తగ్గిపోతుండటంతో మూడో సంతానానికి జన్మనిచ్చిన దంపతులకు 50 వేల రూపాయలు ఫిక్సిడ్ డిపాజిట్ ఆఫర్‌ను ప్రకటించింది. గతంలో మూడో సంతానంగా ఆడపిల్ల పుడితేనే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని షరతు పెట్టినప్పటికీ.. తాజాగా దానిని సవరించింది. లింగ భేదం లేకుండా మూడో సంతానంగా ఏ బిడ్డపుట్టినా జనరానా అందిస్తామని తెల్పింది. ముగ్గురు పిల్లల విధానాన్ని ప్రోత్సహించడానికి ఈ మేరకు మహేశ్వరి కమ్యునిటీ ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

తాజాగా రాజస్థాన్‌లోని పుష్కర్‌లో జరిగిన వార్షిక కమ్యునిటీ సమావేశంలో పలు అంశాలపై చర్చలు జరిపారు. తమ సొసైటీలో వివాహాలు జరిపేందుకు స్త్రీ, పురుష నిష్పత్తి తగిన సంఖ్యలో లేరని, దీనివల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని.. అందుకే మూడో బిడ్డకు జన్మనిచ్చిన దంపతులకు బహుమతిగా రూ.50 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. నాసిక్, జగన్నాథపురి, అయోధ్యలో కూడా త్వరలో తమ కమ్యునిటీ తరపున భవనాల నిర్మాణం చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశానికి రాజస్థాన్‌లోని దాదాపు అన్ని జిల్లాల నుంచి వందలాది మంది సొసైటీ ప్రజలు హాజరయ్యారు. జనాభా నియంత్రణ దిశగా ప్రభుత్వ చర్యలకు వ్యతిరేక మహేశ్వరి కమ్యునిటీ నిర్ణయం ప్రస్తుతం చర్చణీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.