IPS officer bribe video: అత్యాచారం కేసులో రూ.20 లక్షల లంచం తీసుకున్న ఐపీఎస్.. విచారణలో క్లీన్‌చిట్! వీడియో వైరల్..
వీడియో కాల్‌లో అత్యాచార నిందితుడి నుంచి రూ.20 లక్షలు లంచం అడుగుతున్న ఐపీఎస్ ఆఫీసర్‌కు సంబంధించిన ఓ పాత వీడియోను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో ఆదివారం (మార్చి 12) పోస్టు..
వీడియో కాల్‌లో అత్యాచార నిందితుడి నుంచి రూ.20 లక్షలు లంచం అడుగుతున్న ఐపీఎస్ ఆఫీసర్‌కు సంబంధించిన ఓ పాత వీడియోను సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియాలో ఆదివారం (మార్చి 12) పోస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్ ఆఫీసర్ డబ్బు దోపిడీకి సంబంధించిన వీడియో బయటపడిన తర్వాతైనా బీజేపీ ప్రభుత్వం దీనిపై విచారణకు ఉపక్రమిస్తుందా? లేదా పరారీలో ఉన్న ఐపీఎస్‌ల జాబితాలో మరొకరిని చేర్చుతుందా అని ప్రశ్నించారు. డీజీపీ హెడ్ క్వార్టర్స్ నుంచి విడుదలైన తాజా నివేదిక ప్రకారం.. అనిరుద్ సింగ్‌పై పలు అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోపై వారణాసి పోలీసు కమిషనర్ మూడు రోజుల్లో వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటనపై యూపీ ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
కాగా సదరు ఐపీఎస్ ఆఫీసర్ అనిరుద్ సింగ్‌గా గుర్తించారు. ప్రస్తుతం అనిరుద్ సింగ్ మీరట్ (రూరల్) ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నాడు. 18 నెలల క్రితం అనిరుద్ సింగ్ వారణాసి అడిషనల్ ఎస్పీగా ఉన్న సమయంలో జరిగిన సంఘటనకు సంబంధించిన వీడియో ఇది. దీనిపై అనిరుద్ సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇది పాత వీడియో. దీనిపై పోలీస్ హెచ్‌క్యూలు విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చారు. నన్ను ట్రాప్ చేసేందుకు ఇదంతా చేశారు. నేను కూడా సోషల్ మీడియా ద్వారానే దీని గురించి తెలుసుకున్నాను’ అని సింగ్ చెప్పుకొచ్చాడు. క్లీన్ చిట్ తర్వాత నిరుద్ సింగ్ ఫతేపూర్ అడిషనల్ ఎస్పీగా, మీరట్‌లో ఎస్పీ (రూరల్)గా నియమించబడ్డారు. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ వీడియో షేర్ చేసిన తర్వాత డీజీపీ ఆఫీస్ మళ్లీ విచారణకు ఆదేశించడం విశేషం.
उप्र में एक आईपीएस की वसूली के इस वीडियो के बाद क्या बुलडोज़र की दिशा उनकी तरफ़ बदलेगी या फिर फ़रार आईपीएस की सूची में एक नाम और जोड़कर संलिप्त भाजपा सरकार ये मामला भी रफ़ा-दफ़ा करवा देगी।
उप्र की जनता देख रही है कि ये है अपराध के प्रति भाजपा की झूठी ज़ीरो टालरेंस की सच्चाई। pic.twitter.com/JsMAhzRFPU
— Akhilesh Yadav (@yadavakhilesh) March 12, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.