Indonesia’s Merapi volcano: మరోసారి బద్దలైన ఇండోనేషియాలోని మెరాపి అగ్నిపర్వతం.. వైరల్‌ అవుతోన్న వీడియో..

ఇండోనేషియాలో మెరాపి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. భారీగా లావా, బూడిద, వేడి వాయువులు వెలువడుతున్నాయి. ఏడు కిలోమీటర్ల మేర ధూళి మేఘాలు..

Indonesia's Merapi volcano: మరోసారి బద్దలైన ఇండోనేషియాలోని మెరాపి అగ్నిపర్వతం.. వైరల్‌ అవుతోన్న వీడియో..
Indonesia's Merapi Volcano
Follow us

|

Updated on: Mar 12, 2023 | 9:27 AM

ఇండోనేషియాలో మెరాపి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. భారీగా లావా, బూడిద, వేడి వాయువులు వెలువడుతున్నాయి. ఏడు కిలోమీటర్ల మేర ధూళి మేఘాలు కమ్ముకున్నాయి.1.5 కిలోమీటర్ల మేర లావా ప్రవాహాస్తోంది.. అగ్నిపర్వతం నుంచి మూడు నుంచి 7 కిలోమీటర్ల పరిధిలోని ప్రజల కార్యకలాపాలను ప్రభుత్వం నిలిపివేసింది.

కాగా మెరాపి ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వాతాల్లో ఒకటిగా ఉంది. జావా ద్వీపంలోని యోగ్యకర్త నగరం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరం వరకు ఇది విస్తరించి ఉంది. ఇది గతంలో 2020, ఇదే నెలలో బద్దలైంది. ఆ సమయంలో ఆరు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద కమ్మేసింది. ఇక 2010లో ఈ అగ్నిపర్వతం భారీగా విస్ఫోటనం చెందింది. దీంతో దాదాపు 350 మందికి పైగా మరణించారు. సుమారు 20 వేల మందిని ఇతర గ్రామాలకు తరలించారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌ భూభాగంలో ఉన్నందున ప్రపంచంలోని ఇతర దేశాల కంటే కూడా అత్యధిక అగ్నిపర్వతాలు ఇక్కడ ఉన్నాయి. ఇక మెరాపి అగ్నిపర్వతం ఇప్పటికే 5 నుంచి 6 సార్లు పేలింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.