AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Wedding: నా జీవితం ఆ కన్నయ్యకు అంకితం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని వివాహమాడిన మహిళ

శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చారు.. చాలా మంది అతిథులు, బంధుమిత్రులను ఆహ్వానించారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకాలతో కూడిన ఎన్నో రకాలైన భోజనాలు ఏర్పాటు చేశారు.

Unique Wedding: నా జీవితం ఆ కన్నయ్యకు అంకితం.. శ్రీ కృష్ణుడి విగ్రహాన్ని వివాహమాడిన మహిళ
Viral News Of Wedding
Jyothi Gadda
|

Updated on: Mar 14, 2023 | 4:24 PM

Share

శ్రీకృష్ణునికి సర్వస్వం అర్పించిన మీరాబాయి కథ మన అందరికీ తెలిసిందే. అయితే, తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శ్రీ కృష్ణుడిని పెళ్లి చేసుకున్న, నా జీవితాన్ని ఆ కృష్ణ పరమాత్ముడికే అంకితం చేస్తున్నా అంటూ కృష్ణుడి విగ్రహంతో వెళ్లిపోయింది. నేను భగవంతుడిని నా భర్తగా అంగీకరించాను. అని ఆమె తన తల్లిదండ్రులకు చెప్పింది. అదే విధంగా ఔరయ్యాలో తల్లిదండ్రుల అంగీకారంతో గ్రాండ్‌గా పెళ్లి జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్య జిల్లాకు చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు రంజిత్ సింగ్ సోలంకి కుమార్తె రక్ష (30) పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఎల్‌ఎల్‌బి చదువుతోంది. శ్రీకృష్ణుడిపై అమితమైన భక్తి. అంకితభావంతో పూజించేది. ఆ భక్తితోనే తాను కృష్ణుడినే పెళ్లి చేసుకోవాలని భావించింది. విగ్రహాన్ని వివాహం చేసుకుని తన జీవితాంతం ఆ కన్నయ్యతోనే ఉండాలని నిర్ణయించుకుంది. శ్రీకృష్ణుడిని వివాహం చేసుకోవాలనే ఆమె కోరికను ఆమె తండ్రి కూడా అంగీకరించాడు. అట్టహాసంగా కూతురి వివాహ వేడుక నిర్వహించాడు. అందంగా అలంకరించిన కళ్యాణ మండపంలో వివాహం జరిపించాడు.

తన కూతురుకి కృష్ణుడిపై ఉన్న అపారమైన భక్తిని చూసిన తండ్రి రంజిత్ సింగ్.. ఆమె ఇష్టానుసారంగా వ్యవహరించాడు. వివాహ వేడుక కోసం కల్యాణ మండపాన్ని శోభాయమానంగా అలంకరించారు. శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగింపుగా మండపానికి తీసుకువచ్చారు.. చాలా మంది అతిథులు, బంధుమిత్రులను ఆహ్వానించారు. అంతేకాకుండా శ్రీకృష్ణుడికి ఇష్టమైన వంటకాలతో కూడిన భోజనాలు ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

వివాహ వేడుకల కోసం ముందుగా వరుడు కృష్ణుడి విగ్రహంతో పాటు సుఖ్‌చైన్‌పూర్ ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి వెళ్లింది. తరువాత, వధువు కృష్ణుడి విగ్రహాన్ని ఒడిలో పెట్టుకుని తన తల్లి ఇంటికి తిరిగి వచ్చింది. మొత్తానికి ఆమె కోరిక మేరకే మ్యారేజ్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిపించారు తల్లిదండ్రులు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ ..

ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు
బుమ్రా లేని లోటు తీర్చడానికి బాస్ వస్తున్నాడు