యూపీలో హోలీ సందర్భంగా అమానుష ఘటన.. సిక్కు యువకుడిపై దాష్టీకం..!

UP Holi: ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిన అమానుష ఘటన వెలుగలోకి వచ్చింది. హోలీ రోజున ఒక సిక్కు వ్యక్తికి రంగు వేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు.

యూపీలో హోలీ సందర్భంగా అమానుష ఘటన.. సిక్కు యువకుడిపై దాష్టీకం..!
Holi
Follow us
Balaraju Goud

| Edited By: Anil kumar poka

Updated on: Mar 14, 2023 | 7:24 PM

ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌లో జరిగిన అమానుష ఘటన వెలుగలోకి వచ్చింది. హోలీ రోజున ఒక సిక్కు వ్యక్తికి రంగు వేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించారు. దీనిని నిరసిస్తూ సిక్కు వ్యక్తి తన కత్తిని తీసి బెదిరించాడు. దీంతో కోపోద్రిగ్తులైన స్థానికులు ఒక్కసారిగా అతనిపై దాడికి పాల్పడ్డారు. అతని తలపాగా తీసి, తీవ్రంగా కొట్టారు. అతని ఒంటి నిండా రంగులతో ముంచారు. బలవంతంగా రంగులు చల్లి, కోడి గుడ్లు కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై దృష్టి సారించిన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విచారణకు ఆదేశించారు.

ఇంటర్నెట్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియోలో హోలీ సందర్భంగా యువకులు రోడ్డుపై వీరంగం సృష్టిస్తున్నారు. ఇంతలో ఓ సిక్కు వ్యక్తి బైక్‌పై అక్కడి నుంచి వెళ్తున్నాడు. దుర్మార్గుల గుంపు సిక్కు వ్యక్తిని చుట్టు ముట్టింది. అతనిపై రంగులు వేయడానికి ప్రయత్నించింది. దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిపై వారిపై కత్తి చూపించి బెదించాడు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

సిక్కు వ్యక్తి దానిని వ్యతిరేకించడం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో కత్తిని బయటకు తీసి గాలిలో తిప్పాడు. దీని తరువాత, దుండగులు అతనిపై దాష్టీకానికి పాల్పడ్డాడు. యువకుడిపై దాడి చేస్తూ.. తలపాగా తీసేసి రంగులతో ముంచి కొట్టారు. సంఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇది కాస్తా సోషల్ మీడియాకు ఎక్కడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందించిన పోలీసులు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అతుల్ శర్మ ప్రకారం, ఈ వీడియో పిలిభిత్ జిల్లా పురాన్‌పూర్ పట్టణానికి చెందినది చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు పురాన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించామని ఎస్పీ తెలిపారు. విచారణ బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి 

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే