AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajasthan: పుల్వామా దాడిని ప్రధాని మోదీనే చేయించాడా?.. కాంగ్రెస్ లీడర్ సంచలన కామెంట్స్..!

ప్రధాని నరేంద్ర మోదీపై రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ పెను..

Rajasthan: పుల్వామా దాడిని ప్రధాని మోదీనే చేయించాడా?.. కాంగ్రెస్ లీడర్ సంచలన కామెంట్స్..!
Sukhjinder Singh Randhawa
Shiva Prajapati
|

Updated on: Mar 14, 2023 | 4:06 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీపై రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ సుఖ్‌జీందర్ సింగ్ రంధావా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ పెను వివాదానికి తెరలేపారు. పుల్వామా ఉగ్రదాడి అసలు ఎలా జరిగిందని ప్రశ్నించారు. పుల్వామా ఘటనలో 44 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు చనిపోవడానికి కారకులను ఇప్పటికీ పట్టుకోలేదని, దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆరోపించారాయన.

జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన రాంధావా.. ప్రధాని మోదీపై సంచలన ఆరోపణలు చేశారు. ‘పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల మాఫియాలను అరికట్టింది. అకాలీదల్‌ను ఎదుర్కొన్నాం. మోదీని నిలువరించలేమా? నా గ్రామం పాకిస్తాన్‌కు 5 కిలోమీటర్ల దూరం మాత్రమే. మేము ఎప్పుడూ పాకిస్తాన్‌ను చూసి భయపడింది లేదు. మోదీ గారేమో.. ఘూస్ కే మారేంగే అని పెద్ద పెద్ద ప్రకటనలు చేస్తారు. మరి పుల్వామా దాడి ఎలా జరిగింది. దీనిపై విచారణ ఏది? ఈ రోజు వరకు ఆ ఘటనకు బాధ్యులెవరు? ఎంతమందిని అరెస్ట్ చేశారు? వంటి వివరాలేవీ, ఎవరికీ తెలియదు. ఇది ఏమైనా ఎన్నికల్లో గెలుపు కోసం చేసిన చర్యనా?’ అంటూ సంచలన ఆరోపణలు చేశారు రాంధావా.

ఫిబ్రవరి 14, 2019న జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 44 మంది CRPF జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ తరువాత ఫిబ్రవరి 26 రాత్రి బాలాకోట్‌లో వైమానిక దాడితో భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది. ఏప్రిల్-మే 2019లో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. వీటన్నింటినీ ఉటంకిస్తూ రాంధావా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంతటితో ఆగని.. సుఖ్‌జీందర్ సింగ్ రంధావా ప్రధాని మోడీపై మరికొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. మోడీ ఇంకా అధికారంలో ఉంటే భారతదేశం పతనం ఖాయం అని వ్యాఖ్యానించారు. మోదీ పోతే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు. తమ కంటే దేశ భక్తులెవరు లేరని బీజేపీ నాయకులు అంటున్నారని, అసలు దేశం కోసం పోరాడిన ఒక్క బీజేపీ నాయకుడిని చూపించాలని డిమాండ్ చేశారు సుఖీందర్ సింగ్. మోదీ పాలనలో భారతదేశంలో కంపెనీల పాలన వైపు పయనిస్తోందన్నారు. భారతదేశాన్ని.. అదానీ దేశంగా మార్చేస్తున్నారని, కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రాగానే అవినీతి పటాపంచల్ అవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, ప్రధాని నరేంద్ర మోదీపై సుఖీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. బీజేపీ నేతలు సీరియస్‌గా రియాక్ట్ అవుతున్నారు. కాంగ్రెస్ నేత కామెంట్లపై ఎదురుదాడికి దిగారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..