AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మాయికి ఇంటర్‌లో మార్కులు తక్కువొచ్చాయని.. పెళ్లికి నిరాకరించిన వరుడు.. ఖాకీల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది..

అమ్మాయి పెళ్లి కోసం రూ. 60 వేలకు పైగా ఖర్చు చేసి వరుడికి 15 వేల విలువైన బంగారు ఉంగరాన్ని ఇచ్చి సోనుతో వివాహం జరిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అమ్మాయికి ఇంటర్‌లో మార్కులు తక్కువొచ్చాయని.. పెళ్లికి నిరాకరించిన వరుడు.. ఖాకీల ఎంట్రీతో కథ అడ్డం తిరిగింది..
Marriage
Jyothi Gadda
|

Updated on: Mar 14, 2023 | 4:49 PM

Share

ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది . 12వ తరగతి పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయని వధువును పెళ్లి చేసుకోవడానికి వరుడు నిరాకరించాడు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కేసు వెనుక గల అసలు కారణాలను గుర్తించారు. రెండు కుటుంబాలు సరైన నిర్ణయం తీసుకోలేదని తిర్వా కొత్వాలి జోన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ పి.ఎన్.బాజ్‌పాయ్ అన్నారు. ఇంతకీ వరుడు పెళ్లికి నిరాకరించిన కారణం ఏంటనే వివరాల్లోకి వెళితే…

బాగంవ గ్రామానికి చెందిన రామశంకర్ కుమారుడు సోని కుమార్తె సోనికి వివాహం నిశ్చయించారు. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. తీరా వధువు మెడలో తాళిపడే సమయానికి వరుడు ఏదో ఒక పిచ్చి కారణం చెబుతూ.. పెళ్లికి నిరాకరించాడు. 12వ తరగతి మార్కు షీట్‌లో వధువుకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పాడు. తీరా పోలీసులు రంగప్రవేశం చేయటంతో అసలు విషయం బయటపడింది. వధువు కుటుంబం తమ కట్నం డిమాండ్లను తీర్చకపోవడంతో వరుడి కుటుంబం వివాహాన్ని రద్దు చేసిందని పోలీసులు తేల్చారు. ఈ మేరకు వరుడి కుటుంబంపై కేసు నమోదు చేశారు. అమ్మాయి పెళ్లి కోసం రూ. 60 వేలకు పైగా ఖర్చు చేసి వరుడికి 15 వేల విలువైన బంగారు ఉంగరాన్ని ఇచ్చి సోనుతో వివాహం జరిపించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

పెళ్లికి ముందు రోజు నుండే వరుడి కుటుంబం కట్నం డిమాండ్ చేసిందని ఆరోపించారు. తనకు ఎక్కువ కట్నం ఇవ్వలేనని వధువు తండ్రి చెప్పడంతో 12వ తరగతిలో అమ్మాయికి తక్కువ మార్కులు వచ్చాయని వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుంది. వధువు కుటుంబీకులు తమ బంధువుల ద్వారా వరుడి కుటుంబీకులను ఒప్పించేందుకు ప్రయత్నించగా, వరుడి కుటుంబీకులు వారు అడిగిన కట్నం ఇచ్చే వరకు పెళ్లి జరగదని తేల్చి చెప్పారు. దీంతో వధువు తండ్రి పోలీసులను ఆశ్రయించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ ..

Follow Us
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ లోన్లకు ఎందుకంత క్రేజ్? ఇప్పుడు వాళ్లు కూడా బంగారం తాకట్టు
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
గోల్డ్ మెడల్ కోసం పోరు.. మరికొద్దిసేపట్లో మ్యాచ్..
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
ఆదిలాబాద్ రిమ్స్‌‌లో ఘోర ప్రమాదం.. ఏసీ పేలి ఇద్దరు చిన్నారుల మృతి
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
అడ్వాన్స్ బుకింగ్స్‏లో ది ప్యారడైజ్ విధ్వంసం..
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌