బోరుబావి… మింగేస్తూనే ఉంది.. 77 అడుగుల లోతులో చిన్నారి ప్రాణం..!

మొత్తం 4 బృందాలు 9 గంటల పాటు చిన్నారిని రక్షించడానికి ప్రయత్నించాయి. కానీ, ఫలితం లేకపోయింది. చిన్నారి ప్రాణం పోయింది. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 15 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడింది చిన్నారి.

బోరుబావి… మింగేస్తూనే ఉంది.. 77 అడుగుల లోతులో చిన్నారి ప్రాణం..!
Borewell
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 14, 2023 | 3:22 PM

బోరుబావులు చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. మధ్యప్రదేశ్‌ లోని విదిషా జిల్లా లాటేరీ సమీపంలోని ఆనంద్‌పూర్‌లో 8 ఏళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. పొలం పనుల్లో తల్లిదండ్రుల వెంట వెళ్లిన 8 ఏళ్ల చిన్నారి 77 అడుగుల లోతున్న బోర్‌వెల్ గుంతలో పడిపోయాడు. దినేశ్‌ను కాపాడడానికి భారీ సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. sdrf బృందాలు బాలుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. బుల్‌డోజర్లతో పాటు భారీ యంత్రాలను సహాయక చర్యల కోసం ఉపయోగిస్తున్నారు. దినేష్‌ అహిర్వార్‌ని కాపాడడానికి అన్ని ప్రయత్నాలు చేస్తునట్టు అధికారులు వెల్లడించారు.

మరో ఘటనలో బోరుబావిలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో చోటుచేసుకుంది. పూణేకు 125 కి.మీ దూరంలోని కర్జాత్ తహసీల్‌లోని కోపర్డి గ్రామంలో ఓ చిన్నారి బావిలో పడింది. మొత్తం 4 బృందాలు 9 గంటల పాటు చిన్నారిని రక్షించడానికి ప్రయత్నించాయి. కానీ, ఫలితం లేకపోయింది. చిన్నారి ప్రాణం పోయింది. సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 15 అడుగుల లోతులో ఉన్న బోరుబావిలో పడింది చిన్నారి.

సమాచారం అందుకున్న వెంటనే4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చిన్నారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. బోరు బావి చుట్టూ ఉన్న మట్టిని జేసీబీ యంత్రం ద్వారా తొలగించారు. కానీ, బాలుడు ఎలాంటి సమాధానం చెప్పలేదు. పై నుంచి చిన్నారితో మాట్లాడేందుకు అధికారులు ప్రయత్నించారు. అయినప్పటికీ ఎలాగోలా శ్రమించి చిన్నారిని బోరుబావి నుంచి బయటకు తిశారు. వెంటనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అయితే, అప్పటికే బాలుడు మరణించాడని వైద్యులు నిర్దారించారు. మరోవైపు చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో ఎటు చూసినా భయానక నిశ్శబ్దం ఆవహించింది.

ఇవి కూడా చదవండి

గతంలో ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో ఆరేళ్ల బాలుడు 40 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. అయితే రెస్క్యూ టీం అతడిని సురక్షితంగా రక్షించింది.

జాతీయ వార్తల కోసం

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే