Africa Splitting: ప్రపంచపటం మారబోతోంది..?.. ఇకపై ఖండాలు ఏడు కాదు.. ఎనిమిది.. !

ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంకేతంగా భావిస్తున్నారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌, ఎర్రసముద్రంలోని నీరే ఈ పగులులోకి ప్రవేశించి కొత్త సముద్రంగా రూపొందుతుందంటున్నారు శాస్త్రవేత్తలు.

Africa Splitting: ప్రపంచపటం మారబోతోంది..?.. ఇకపై ఖండాలు ఏడు కాదు.. ఎనిమిది.. !
Africa
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 14, 2023 | 1:21 PM

ప్రపంచపటం మారబోతోంది.. భవిష్యత్తులో ఖండాలు ఏడు కాదు ఎనిమిది అని చెప్పే సమయం రాబోతోంది… అవును ఆఫ్రికా ఖండం రెండుగా చీలబోతోంది. ఈ విషం ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు, భూగర్భ నిపుణులు అంటున్నమాట. ఆఫ్రికా ఖండం రెండుగా చీలి, ఆ చీలిక మధ్యలో సరికొత్త సముద్రం ఏర్పడబోతోందని, అందుకు భూమి లోపలా, బయటాకూడా సంకేతాలు మొదలైపోయాయని భూగర్భ నిపుణులు అంటున్నారు. ఆఫ్రికన్‌ రిఫ్ట్‌ లోయ ద్వారా కొత్త మహాసముద్రం ఏర్పడుతోందని వారు వివరించారు. ‘‘2005 నాటికే ఇథియోపియాలోని ఎడారుల్లో జోర్డాన్‌ నుంచి మొంజాబిక్‌ వరకూ 6400 కిలోమీటర్ల పొడవున, 35 మైళ్ల వెడల్పున ఓ భారీ చీలిక ఏర్పడింది. ఒక మహాసముద్రం ఏర్పాటుకు ఇదే నాంది’’ అని పరిశోధకులు పేర్కొన్నారు.

భూభాగం విషయంలో నిరంతరం మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ మార్పులు అప్పటికప్పుడు కనిపించేవి కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ మార్పులు జరుగుతుంటాయి. తాజాగా అలాంటి భారీ మార్పే ఆఫ్రికా ఖండంలో జరగబోతోంది. ఆఫ్రికా రెండుగా చీలి, కొత్తఖండం ఏర్పడబోతోంది. ఈ చీలికలో భాగంగా వీటి మధ్య కొత్త సముద్రం కూడా ఆవిర్భవించే అవకాశాలున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ మార్పును తూర్పు ఆఫ్రికా చీలికగా పేర్కొంటున్నారు. భూగర్భంలో ఉండే టెక్టానిక్‌ ప్లేట్‌ అనే ఒక పలక భాగం రెండుగా విడిపోవడాన్ని శాస్త్రవేత్తలు చీలికగా చెబుతారు. ఈ పలకలు కదిలినప్పుడు భూమిపైనా, భూమిలోపలా లోయల్లాంటి పగుళ్లు ఏర్పడతాయి.

38 మిలియన్‌ ఏళ్ల క్రితం దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండాలుకూడా ఇలాగే విడిపోయాయి. ఇప్పుడు ఆఫ్రికాలోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. 2005లో ఇథియోపియా ఎడాలరిలో 56 కిలో మీటర్ల భారీ చీలిక ఏర్పడగా, 2018లో కెన్యాలోనూ ఇలాంటి పగులు ఏర్పడింది. తాజాగా ఆఫ్రికన్‌ నుబియన్‌, ఆఫ్రికన్‌ సొమాలి, అరేబియన్‌ అనే పలకల వద్ద పగుళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది కొత్త సముద్రం ఏర్పాటుకు సంకేతంగా భావిస్తున్నారు. గల్ఫ్‌ ఆఫ్‌ ఏడెన్‌, ఎర్రసముద్రంలోని నీరే ఈ పగులులోకి ప్రవేశించి కొత్త సముద్రంగా రూపొందుతుందంటున్నారు లీడ్స్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త క్రిస్టఫర్‌ మూర్‌.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే మొదలైన ఈ ప్రక్రియ పూర్తవటానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. కొత్త సముద్రం ఆవిర్భవించటానికి 5 నుంచి 10 మిలియన్‌ సంవత్సరాలు పట్టొచ్చని నైరోబీ విశ్వవిద్యాలయం భూగర్భశాస్త్ర విభాగం శాస్త్రవేత్త ఎడ్విన్‌ డిండి తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే