AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Coconut Water Benefits: మండే ఎండల్లో లే లేత కొబ్బరి నీళ్ళు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?

ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండడం వల్ల శరీరానికి కావల్సిన అన్ని విటమిన్లు లభిస్తాయి. లే లేత కొబ్బరి నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Tender Coconut Water Benefits: మండే ఎండల్లో లే లేత కొబ్బరి నీళ్ళు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
Coconut Water
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2023 | 7:10 PM

Share

ఎండకాలం వచ్చేసింది.అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. ఎండవేడి, ఉక్కపోత కారణంగా ప్రజలు అవస్థలు పడుతున్నారు. అంతే కాదు, తీవ్రమైన ఎండల కారణంగా ప్రజలు తరచూ డీ హైడ్రేషన్ గురవుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. వేసవిలో శరీర వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి లేత కొబ్బరి నీరు అద్భుతంగా సహాయ పడతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, సోడియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉండడం వల్ల శరీరానికి కావల్సిన అన్ని విటమిన్లు లభిస్తాయి. లే లేత కొబ్బరి నీళ్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

లేత కొబ్బరి నీరు వల్ల శరీరాని ఈ 4 లభాలు:

రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

పెరుగుతున్న వేడి కారణంగా శరీరంలో రోగనిరోధక స్థాయి తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీరు శక్తిని పెంచడాని కృషి చేస్తుంది.

ఇవి కూడా చదవండి

చర్మం మెరుపునిస్తుంది: వేసవిలో చర్మాన్ని తేమగా ఉంచడం చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో కొబ్బరి నీరు తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ నీరును తాగడమే కాకుండా, ముఖానికి కూడా రాస్తే మొటిమలు తొలగిపోతాయని పేర్కొన్నారు.

కిడ్నీలకు మంచిది: లేత కొబ్బరి నీరు మూత్రపిండాల సమస్యల నుంచి రక్షణ పొందడాని చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపులు తెలుపుతున్నారు. ఈ నీరును తాగడం వల్ల మూత్రపిండాలలో రాళ్లను తొలగిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

జీర్ణక్రియకు తోడ్పడుతుంది : అజీర్తి సమస్యలు ఉన్నవారు లేత కొబ్బరి నీళ్లు తాగటం మంచిది. ఎందుకంటే ఇది మన జీర్ణవ్యవస్థకు సూపర్ ఫుడ్ లాంటిది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. మన ప్రేగులను కూడా ఆరోగ్యంగా చేస్తుంది.

డయాబెటిస్‌పై ప్రభావం చూపుతుంది: ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ కొబ్బరి నీరు ఉండే గుణాలు రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుందని ఇది డయాబెటిక్ పేషెంట్లు తాగ వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు.

బరువు తగ్గడంలో ఎఫెక్టివ్ : లేత కొబ్బరితో క్యాలరీలు పెరుగుతాయని, తద్వారా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని చాలా మంది నమ్ముతారు. అయితే ఇది నిజం కాదు, మీరు దీన్ని పరిమిత పరిమాణంలో తీసుకుంటే, మీ పొట్ట, నడుము కొవ్వు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..