AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves Benefits: ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే కలిగే అద్భుతమైన ఫలితాలు తెలుసా.! ఈ 5 వ్యాధులు పరార్..!!

ఉదయాన్నే పరగడుపున తింటే చాలా రోగాలు నయమవుతాయి. కరివేపాకు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.

Curry Leaves Benefits: ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే కలిగే అద్భుతమైన ఫలితాలు తెలుసా.! ఈ 5 వ్యాధులు పరార్..!!
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2023 | 6:42 PM

Share

కరివేపాకు.. దీన్ని మనమందరం వంటకాల్లో సువాసన కోసం ఉపయోగిస్తాం. ఈ కరివేపాకులను దక్షిణ భారత వంటలలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ, భోజనం చేసే సమయంలో మాత్రం ఏరి పారేస్తుంటారు.. అలాంటి కరివేపాకులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులో ఫాస్పరస్, కాల్షియం, ఐరన్, కాపర్, విటమిన్లు మరియు మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఉదయాన్నే పరగడుపున తింటే చాలా రోగాలు నయమవుతాయి. కరివేపాకు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఇక్కడ తెలుసుకుందాం.

కరివేపాకు ప్రయోజనాలు:

1. కళ్లకు మంచిది: కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది అంధత్వ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది.

2. మధుమేహం నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే హైపోగ్లైసీమిక్ లక్షణాల కారణంగా, కరివేపాకులను డయాబెటిక్ రోగులు తరచుగా నమలాలని సిఫార్సు చేస్తారు.

ఇవి కూడా చదవండి

3. జీర్ణక్రియ మెరుగుదల: ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకును నమలడం వల్ల మీ జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఇది మలబద్ధకం, అసిడిటీ, ఉబ్బరం మొదలైన కడుపు సంబంధిత సమస్యలను కూడా నయం చేస్తుంది.

4. ఇన్ఫెక్షన్ నుండి రక్షణ: కరివేపాకులో యాంటీ ఫంగల్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

5. బరువును తగ్గిస్తుంది: కరివేపాకు ఆకులను నమలడం వల్ల బరువు, పొట్ట కొవ్వు తగ్గుతాయి, ఎందుకంటే ఇందులో ఇథైల్ అసిటేట్, మహనింబిన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు అధిక మొత్తంలో ఉంటాయి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ..