Air India: విమానం టాయిలెట్‌లోంచి పొగలు..! తీరా ఏంటని చూసిన సిబ్బందికి ఊహించని సీన్ ఎదురైంది..
లండన్ నుంచి ముంబైకి వస్తున్న విమానం (ఏఐ130)లో టాయిలెట్‌లో పొగ తాగుతూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడని ఎయిర్ ఇండియా తెలిపింది. కాళ్లు చేతులు కట్టిపడేసినప్పటికీ అతడు తలను సీటుకేసి కొట్టుకోవడం మొదలుపెట్టాడని చెప్పారు.
ప్రస్తుతం గత కొద్ది రోజులుగా విమానంలో ప్రయాణీకుల వింత చేష్టలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకనోక సంఘటనలో ప్రయాణీకుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన సంఘటన సంచలనం రేపింది. మరో ఘటనలో విమాన సిబ్బందితో ప్రయాణికుడి అనుచిత ప్రవర్తన వైరల్‌గా మారింది. ఇప్పుడు కూడా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి విమానంలోని టాయిలెట్‌లో పొగ తాగుతూ పట్టుబడ్డాడు. అతడిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. విమానంలోని టాయిలెట్‌లో సిగరెట్ తాగిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆ వ్యక్తి విమానంలో సిగరెట్ తాగడమే కాకుండా ఇతర ప్రయాణికులు, సిబ్బందితో దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలున్నాయి. అయితే, విమానంలో సిగరెట్ తాగడం ఎంత పెద్ద నేరమో తెలుసా?
లండన్ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడి పేరు రమాకాంత్, భారత సంతతికి చెందిన అమెరికన్ పౌరుడిగా తెలిసింది. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులపై ఐపీసీ సెక్షన్ 336, ఎయిర్‌క్రాఫ్ట్ యాక్ట్ 1937లోని సెక్షన్ 22, 23, 25 కింద కేసు నమోదు చేశారు. ఎయిర్ ఇండియా సిబ్బంది పోలీసులకు చెప్పిన వివరాల మేరకు..’ఫ్లైట్‌లో పొగతాగడానికి అనుమతి లేదు, కానీ అతను వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఫైర్ అలారం మోగింది. ఇది విన్న సిబ్బంది వాష్‌రూమ్‌కి వెళ్లి చూడగా అతని చేతిలో సిగరెట్ ఉండడం గమనించారు. సిబ్బంది వెంటనే అతని చేతిలోని సిగరెట్ ఆర్పివేశారు. దాంతో అతడు రమాకాంత్ సిబ్బందిపై అరవడం మొదలుపెట్టాడు. తీవ్ర వాగ్వాదం అనంతరం అతన్ని ఎలాగోలా సీటులో కూర్చోబెట్టారు సిబ్బంది.. అయితే కొద్దిసేపటి తర్వాత విమానం తలుపులు తెరవడానికి ప్రయత్నించాడు. అతడి ప్రవర్తన చూసి ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. అతను ఎవరి మాట వినటంలేదు. పైగా ఏడుపు మొదలుపెట్టాడు. దాంతో సిబ్బంది అతని చేతులు, కాళ్ళు కట్టి, సీటుపై కూర్చోబెట్టారు. అప్పటికీ అతడు శాంతించలేదు. కాళ్లు చేతులు కట్టిపడేసినప్పటికీ అతడు తలను సీటుకేసి కొట్టుకోవడం మొదలుపెట్టాడని చెప్పారు.
ఎట్టకేలకు రమాకాంత్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతని బ్యాగ్ చెక్ చేయగా, ఈ-సిగరెట్ ఒకటి లభించింది. అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతను ఏదైనా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడా..? అనే సందేహం వ్యక్తం చేశారు పోలీసులు, సిబ్బంది. ఈ మేరకు అతనికి పలురకాల టెస్టులు కూడా నిర్వహించారు. ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి కూడా ఈ ఘటనను ధృవీకరించారు. లండన్ నుంచి ముంబైకి వస్తున్న విమానం (ఏఐ130)లో టాయిలెట్‌లో పొగ తాగుతూ ఓ ప్రయాణికుడు పట్టుబడ్డాడని ఎయిర్ ఇండియా తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..