AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: 9 నెలలు కాదు.. ఏకంగా 9 సంవత్సరాలు గర్భాన్ని మోసింది.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?

ఆ మహిళ తినే ఏ ఆహారాన్ని జీర్ణించుకోలేక పోయింది. క్రమంగా పోషకాహారలోపానికి గురవుతూ వచ్చింది. దీర్ఘకాలిక పోషకాహార లోపంతో చివరకు

Viral News: 9 నెలలు కాదు.. ఏకంగా 9 సంవత్సరాలు గర్భాన్ని మోసింది.. చివరకు ఏం జరిగిందో తెలుసా..?
Pregnant Woman
Jyothi Gadda
|

Updated on: Mar 13, 2023 | 6:03 PM

Share

అమెరికాలోని కాంగో నగరంలో ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ 9 సంవత్సరాలపాటు గర్భాన్ని మోసింది. చివరకు ఆమె కడుపులోంచి శిశువుకు బదులుగా రాయి బయటకు వచ్చింది. చాలా మంది మహిళలకు తల్లి కావడం అనేది జీవితంలో ఎదుర్కొనే పెద్ద సవాలు. ఒక స్త్రీ బిడ్డకు జన్మనివ్వడం అంటే ఆమెకు అదో పునర్జమ్మతో సమానం. అంతే సంతోషకరమైన క్షణం కూడా. సాధారణంగా స్త్రీ గర్భధారణ చక్రం 9 నెలల పాటు కొనసాగుతుందని మనందరికీ తెలిసిన విషయమే. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాలలో శిశువు ఏడో నెల, ఎనిమిదో నెలలో పుడుతుంది. కానీ, ఓ మహిళ 9 నెలలకు బదులు దాదాపు 9 ఏళ్ల పాటు గర్భవతి అయిన సంఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కానీ, చివరకు ఆమె కడుపులోంచి శిశువుకు బదులుగా గట్టి రాయి ఒకటి జన్మించింది. ఈ షాకింగ్‌ ఘటన అమెరికాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాలోని కాంగో నగరంలో జరిగింది ఈ విచిత్ర సంఘటన. ఒక అమెరికన్ మహిళ దాదాపు 9 సంవత్సరాల పాటు గర్భవతిగా ఉంది. ఆమె కడుపు నుండి రాయి బయటకు వచ్చింది. సాధారణంగా ఇటువంటి సంఘటనలను వైద్య పరిభాషలో లిథోపెడియన్ అంటారు. ఇందులో రక్తం తగినంత పరిమాణంలో శిశువుకు చేరదు. గర్భధారణ సమయంలో దాని పెరుగుదల ఆగిపోతుంది. అమెరికా మహిళ విషయంలోనూ సరిగ్గా అలాగే జరిగింది.

మహిళ గర్భం దాల్చిన ఏడో నెలలో పిండం కదలడం లేదని వైద్యులు తెలిపారు. అయితే, ఆమె తనకు గర్భస్రావం అయిందని భావించింది. అయితే, అలాంటిదేమీ జరగలేదని వైద్యులు చెప్పారు. ఆమెకు కొన్ని మందులు రాసిచ్చారు. అవి వాడిన తర్వాత తిరిగి చెకప్‌ కోసం రావాలని, సర్జరీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. కానీ, ఇంటికి వెళ్లిన గర్భిణీ తిరిగి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వెళ్లలేదు. అలాగే, కడుపులోనే చనిపోయిన శిశువును 9 సంవత్సరాల పాటు కడుపులోనే మోసింది. దీంతో ఆ మహిళ తినే ఏ ఆహారాన్ని జీర్ణించుకోలేక పోయింది. క్రమంగా పోషకాహారలోపానికి గురవుతూ వచ్చింది. దీర్ఘకాలిక పోషకాహార లోపంతో చివరకు ఆమె కూడా మరణించింది. మహిళ మరణానంతరం ఆమె పోస్టుమార్టం చేసిన వైద్యులు.. మహిళ కడుపులో ఉన్న శిశువు పూర్తిగా రాయిలా మారిపోయిందని గుర్తించారు. మహిళ కడుపులోని పిండం రాయిగా మారి పేగుల్లో కూరుకుపోవటంతో మహిళ మృతి చెందినట్టుగా నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..