AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ప్రమాదకర వ్యాధులన్నింటికీ మూలం కొలెస్ట్రాలే.. ఇలా చేస్తే వెన్నలా కరిగించొచ్చు.. ట్రై చేయండి..

చెడు కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. అది మన రక్తంలో పేరుకుపోవడం ప్రారంభమైనప్పుడు, రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో అధిక రక్తపోటు ప్రారంభమవుతుంది.

Health Tips: ప్రమాదకర వ్యాధులన్నింటికీ మూలం కొలెస్ట్రాలే.. ఇలా చేస్తే వెన్నలా కరిగించొచ్చు.. ట్రై చేయండి..
Health Tips
Shaik Madar Saheb
|

Updated on: Mar 13, 2023 | 5:55 PM

Share

చెడు కొలెస్ట్రాల్‌ను సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. అది మన రక్తంలో పేరుకుపోవడం ప్రారంభమైనప్పుడు, రక్త ప్రసరణలో అవరోధం ఏర్పడుతుంది. ఈ సందర్భంలో అధిక రక్తపోటు ప్రారంభమవుతుంది. దీని తరువాత, ఊబకాయం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధి, మధుమేహం వంటి సంక్లిష్ట వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఇలాంటి సందర్భంలో రోజువారీ ఆహారంలో కొంచెం మార్పు చేస్తే అది అధిక కొలెస్ట్రాల్‌ను చాలా వరకు నియంత్రిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఆ మార్పులు ఏంటో తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఆహారంలో ఇలాంటి మార్పులు చేసుకోండి

  1. గ్రీన్ టీని తాగండి: రోజూ తీసుకునే సాధారణ టీలో చక్కెర కంటెంట్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను పెంచడానికి దోహదపడుతుంది. దీనికి బదులుగా మీరు గ్రీన్ టీకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దాని సహాయంతో బరువు పెరగడానికి బ్రేక్ పడటంతోపాటు చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది.
  2. పండ్లు – కూరగాయలు తినండి: ప్రస్తుతం చాలామంది ఫ్రైలు, నూనె పదార్థాలు, స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు. వీటివల్ల ప్రమాదకరమైన సంతృప్త కొవ్వులు పెరుగుతాయి. ఇవి ఆరోగ్యాన్ని పాడుచేస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినడం ముఖ్యం. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడే ఫైబర్, యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉన్న తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో తీసుకోవడం మంచిది.
  3. సోయాబీన్స్ తినండి: రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడాన్ని పెంచవచ్చు. దీని కోసం మీరు రోజువారీ ఆహారంలో సోయాబీన్స్ చేర్చుకోవచ్చు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అనేక నాన్-వెజ్ ఉత్పత్తుల కంటే.. సోయాబీన్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.
  4. సుగంధ ద్రవ్యాలు తీసుకోండి: కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి హెల్తీ ఫుడ్ తీసుకోవడం పెంచినా.. మసాలాలు తీసుకోవడం మాత్రం తగ్గించకూడదు. పసుపు, అల్లం, దాల్చినచెక్క, వెల్లుల్లి వంటి సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి ఆయుర్వేద లక్షణాలతో నిండి ఉన్నాయి. దీని సహాయంతో సిరల్లో ఫలకం తగ్గడం ప్రారంభమవుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..