అంధకారంలో పాకిస్థాన్ నగరం.. 40 శాతం నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. ఆందోళనలో జనం!

Power Outage In Pakistan: పాకిస్థాన్‌ కరాచీలోని పలు ప్రాంతాల్లో సాంకేతిక లోపం కారణంగా హై టెన్షన్ ట్రాన్స్‌మిషన్ కేబుల్ ట్రిప్ అయ్యింది. ఫలితంగా, అనేక గ్రిడ్ స్టేషన్‌లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

అంధకారంలో పాకిస్థాన్ నగరం.. 40 శాతం నిలిచిపోయిన విద్యుత్ సరఫరా.. ఆందోళనలో జనం!
Karachi
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 14, 2023 | 1:14 PM

పాకిస్తాన్‌ దేశంలోని పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. పలు నగరాలు, పట్టణాల్లో దాదాపు ఒకేసారి విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఎటు చూసినా చీకట్లే.. భారీగా విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో అనేక నగరాలు చీకట్లో మునిగిపోయాయి. దీంతో అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఒకేసారి భారీగా పవర్ నిలిచిపోవడంతో ఏమవుతుందో అర్థం కాక జనం ఆయోమయానికి గురయ్యారు. భయం గుప్పిట్లోనే పాక్ ప్రజలంతా చీకట్లోనే గడిపేశారు. విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

పాకిస్థాన్‌ కరాచీలోని పలు ప్రాంతాల్లో సాంకేతిక లోపం కారణంగా హై టెన్షన్ ట్రాన్స్‌మిషన్ కేబుల్ ట్రిప్ అయ్యింది. ఫలితంగా, అనేక గ్రిడ్ స్టేషన్‌లలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని కారణంగా విద్యుత్‌ను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కరాచీ సహా అనేక ప్రాంతాల్లో భారీ విద్యుత్ కోతలు కనిపించాయి. అయితే, విద్యుత్ సరఫరాకు బాధ్యత వహించే యుటిలిటీ సంస్థ కె ఎలక్ట్రిక్ ఎటువంటి ప్రకటనను విడుదల చేయలేదు. జాతీయ పంపిణీ వ్యవస్థ ఫ్రీక్వెన్సీ క్షీణించడం వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి NTDC బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

ముఖ్యంగా కరాచీలోని నార్త్ నజీమాబాద్, న్యూ కరాచీ, నార్త్ కరాచీ, లియాఖతాబాద్, క్లిఫ్టన్, కోరంగి, ఒరంగి, గుల్షన్ ఎ ఇక్బాల్, సదర్, ఓల్డ్ సిటీ ఏరియా, లాంధీ, గుల్షన్ ఎ జౌహర్, మలిర్, గుల్షన్ ఇ హదీద్ పీపుల్, సైట్ ఇండస్ట్రియల్ ఏరియా , పాక్ కాలనీ, షా ఫైసల్ కాలనీ, మోడల్ కాలనీలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. దాదాపు కరాచీ నగరంలోని 40 శాతం ప్రాంతాలు చీకటిలోకి వెళ్లిపోయాయి.

విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు వీధుల్లో తిరుగుతూ కనిపించారు. కనీస అవసరాలు తీర్చకపోవడంతో చాలా మంది ప్రజలు అల్లాడిపోయారు. అంతకుముందు జనవరిలో కూడా, జాతీయ గ్రిడ్‌లో ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గుల కారణంగా పాకిస్తాన్ తీవ్ర విద్యుత్తు అంతరాయం కలిగింది. కరాచీ, రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్, ముల్తాన్ ఇతరుల నివాసితులు విద్యుత్ అంతరాయం సమస్యను ఎదుర్కొన్నారని నివేదికలు పేర్కొన్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం