AP skill development scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక మలుపు.. ఏడు రోజుల కస్టడీకి నిందితులు..

ఇప్పటికే చాలా వరకు విచారణ చేసింది.  ఆ కేసు ఒకవైపు దర్యాప్తులో ఉండగానే... మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచడంతో ఇప్పుడు అక్రమార్కుల్లో గుబులు పుడుతోంది.

AP skill development scam: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కీలక మలుపు.. ఏడు రోజుల కస్టడీకి నిందితులు..
Ap Skill Development Scam
Follow us

|

Updated on: Mar 13, 2023 | 8:06 PM

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో కోట్లాది నిధులు దారి మళ్లాయన్న వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విచారణ వేగవంతం చేస్తుంది. ఇప్పటికే ఒక వైపు సిఐడి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై విచారిస్తుండగా.. మనీ ల్యాండరింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే.. నలుగురు నిందితులను అరెస్టు చేసిన ఈ డి… ఈ కేసులో మరింత విచారణ కోసం కోర్టులో కస్టడి పిటిషన్‌ను దాఖలు చేసింది. దీంతో నలుగురు నిందితులను ఏడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది విశాఖ కోర్టు.

ఏపీలో సంచలనం కల్పించిన స్టీల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద ఇప్పటికే అరెస్టు చేసిన నలుగురు కీలక నిందితులను ఈ నెల మొదటి వారంలోనే నలుగురిని ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 4న నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. అయితే.. వందల కోట్ల రూపాయల నిధులు దారి మళ్లాయన్న అభియోగంపై జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి సౌమ్యాద్రిశేఖర్ బోస్, వికాస్ కన్విల్కర్, సురేష్ గోయల్, చార్టెడ్ అకౌంటెంట్ ముకుల్ చంద్ర అగర్వాల్ లను కస్టడీకి ఇవ్వాలంటూ విశాఖ న్యాయస్థానంలో ఈడీ (ED) పిటిషన్ దాఖలు చేసింది. నిందితుల కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. నిందితుల తరపున వాదించేందుకు ఢిల్లీ, కలకత్తా, ముంబై నుంచి న్యాయవాదులు వచ్చారు. ఈడీ కస్టడీ పిటిషన్ పై విచారించిన కోర్టు… నిందితులను ఏడు రోజుల విచారణకు కోర్టు అనుమతించింది. 330 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేసినట్టు అభియోగం పై ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించిన ఈ డి.. ఈ కేసులో ఎవరి పాత్ర ఎంత..? దీని వెనుక ఇంకా ఎవరు ఉన్నారన్న దానిపై విచారించనుంది.

మరోవైపు ఈ ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కాంపై సిఐడి… ఇప్పటికే చాలా వరకు విచారణ చేసింది.  ఆ కేసు ఒకవైపు దర్యాప్తులో ఉండగానే… మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచడంతో ఇప్పుడు అక్రమార్కుల్లో గుబులు పుడుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని  ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ